Andhra Women Assaulted: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ పట్ల ఎలా ప్రవర్తించారో తెలిస్తే..
ABN , Publish Date - Jul 16 , 2025 | 10:42 AM
Andhra Women Assaulted: వివాహేతర సంబంధం ఉందని మహిళను స్థంభానికి కట్టేసి కొట్టిన వైనం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి విజయలక్ష్మితో అక్రమసంబంధం పెట్టుకుని అత్తిలిలో నివాసం ఉంటున్నాడు.

పశ్చిమగోదావరి, జులై 16: వివాహేతర సంబంధాలు (Extramarital Affair) దంపతుల మధ్య చిచ్చుపెడుతున్నాయి. దాంపత్య జీవితం చక్కగా సాగిపోతున్న తరుణంలో భర్తకు లేదా భార్యకు వేరే వాళ్లతో సంబంధాల కారణంగా వారి సంసారం బీటలు వారుతున్న పరిస్థితి. అక్రమసంబంధాల కారణంగా ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటనలు, ప్రియురాలితో కలిసి భార్యను పొట్టనపెట్టుకున్న ఘటనలు ఎన్నో చూశాం. ఇక పలు చోట్ల వివాహేతర సంబంధాల గురించి తెలుసుకున్న భార్య లేదా భర్త.. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన సంఘటనలు అనేకం. అంతేకాకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారి పట్ల ఆయా గ్రామస్థులు ప్రవర్తించి తీరు, వారిని హింసించిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోనూ (West Godavari) ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ పట్ల గ్రామస్థులు అమానుషంగా ప్రవర్తించారు.
జిల్లాలోని పాలకోడేరు మండలం మోగల్లు శివారు గుత్తులవారిపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఉందని మహిళను స్థంభానికి కట్టేసి కొట్టిన వైనం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి విజయలక్ష్మితో అక్రమసంబంధం పెట్టుకుని అత్తిలిలో నివాసం ఉంటున్నాడు. విషయం తెలిసిన సుబ్బారావు భార్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆపై విజయలక్ష్మిని సుబ్బారావు భార్య, కుటుంబ సభ్యులు కలిసి గుత్తులవారిపాలానికి తీసుకునివచ్చారు. రాత్రి నుంచి సదరు మహిళను కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు. అక్రమ సంబంధం కారణంగా మహిళను చితకబాదినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వారి నుంచి విజయలక్ష్మిని విడిపించారు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
ఏపీలో దారుణం.. 'జై జగన్' అని అనలేదని బట్టలు విప్పి..!
సీపీఐ నేతపై కాల్పులు... నిందితులను గుర్తించిన పోలీసులు
Read Latest AP News And Telugu News