Share News

Tirumala Laddu Case: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు.. మరో కీలక మలుపు

ABN , Publish Date - Nov 08 , 2025 | 09:31 PM

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. తన వివరాలను సిట్ బృందం అడగటంపై ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు సుబ్బారెడ్డి.

Tirumala Laddu Case: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు.. మరో కీలక మలుపు
Tirumala Laddu Ghee Adulteration Case

అమరావతి,నవంబరు8 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ (Tirumala Laddu) తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో టీటీడీ అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి (SubbaReddy) పాత్ర అనుమానాస్పదంగా ఉందని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court)కు తెలిపింది. ఈ నేపథ్యంలో లావాదేవీలపై అనుమానం ఉంటే బ్యాంక్ ఖాతాల వివరాలు కోరవచ్చని తెలిపింది సిట్ బృందం. ఈ కేసులో దర్యాప్తును కొలిక్కి తీసుకువచ్చేందుకే సుబ్బారెడ్డి వివరాలు కోరుతున్నామని సిట్ బృందం హైకోర్టుకు నివేదించింది.


అయితే, తను, తన సతీమణి బ్యాంకు ఖాతాల వివరాలు కోరడాన్ని హైకోర్టులో టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి సవాల్ చేశారు. అయితే, ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేసింది సిట్ బృందం. కొన్ని కంపెనీలు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలినప్పటికీ సుబ్బారెడ్డి ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోలేదని పేర్కొంది సిట్ బృందం. అయినా కూడా టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసేందుకు సుబ్బారెడ్డి ఆయా సంస్థలకు అనుమతి ఇచ్చారని పేర్కొంది. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది. ఈ కేసులో సుబ్బారెడ్డి లావాదేవీలనూ, అనుమానం వస్తే బ్యాంకు ఖాతాను కూడా పరిశీలించే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుందని సిట్ బృందం స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి...

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 08 , 2025 | 09:46 PM