Share News

Srinivas Verma: జనసేన ఎమ్మెల్యేను కలిసిన కేంద్రమంత్రి.. ఎందుకంటే

ABN , Publish Date - Mar 09 , 2025 | 12:16 PM

Srinivas Varma: పీఎసీ చైర్మన్ అంటే కేబినెట్ మంత్రి కంటే కీలకమైన బాధ్యత అని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. కేంద్రంలో కాగ్ ఎలా ఉంటుందో.. అలాగే పీఏసీ చైర్మన్‌కి అన్ని శాఖల మీద రివ్యూ చేసే అవకాశం ఉంటుందని అన్నారు.

Srinivas Verma: జనసేన ఎమ్మెల్యేను కలిసిన కేంద్రమంత్రి.. ఎందుకంటే
Srinivas Varma

పశ్చిమగోదావరి: పీఎసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను (Pulaparthi Ramanjaneyulu) ఇవాళ(ఆదివారం) కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ (Srinivas Varma) కలిశారు. ఈ సందర్భంగా పులపర్తి రామాంజనేయులతో పలు కీలక విషయాలపై చర్చించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను శ్రీనివాస్ వర్మ అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. పులపర్తి రామాంజనేయులు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి అని శ్రీనివాస్ వర్మ చెప్పారు.


పీఎసీ చైర్మన్ అంటే కేబినెట్ మంత్రి కంటే కీలకమైన బాధ్యత అని శ్రీనివాస్ వర్మ చెప్పారు. సీనియర్ శాసనసభ్యులకు మాత్రమే అటువంటి అవకాశం దొరికే పరిస్థితి ఉంటుందని వివరించారు. పీఏసీ చైర్మన్ పదవి సాధారణంగా ప్రతిపక్షంలో ఉండే పార్టీకి ఇచ్చే సంప్రదాయం ఉందని అన్నారు. రాజ్యాంగంలో లేకపోయినా సాంప్రదాయం చాలా సంవత్సరాలుగా ఉందని చెప్పారు. పీఏసీ చైర్మన్ బాధ్యత ఏదైతే ఉందో ఒక చట్టబద్ధమైనటువంటి కీలకమైన సంస్థ అని తెలిపారు. కేంద్రంలో కాగ్ ఎలా ఉంటుందో.. అలాగే పీఏసీ చైర్మన్‌కు అన్ని శాఖల మీద రివ్యూ చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులకు కేబినెట్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్ రావడం తనకు చాలా సంతోషంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు.


స్వచ్ఛంద సంస్థకు శ్రీనివాస వర్మ విరాళం

పాలకొల్లు నిమ్మల ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేశారు. ధర్మారావు ఫౌండేషన్ స్ఫూర్తితో తాను కూడా తన నాన్న సూర్యనారాయణ రాజు పేరిట త్వరలో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు. విద్యాభివృద్ధి, నిరుద్యోగుల కోసం మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహిస్తున్న ఈ కోచింగ్ సెంటర్‌కు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రూ. 5 లక్షలు వ్యక్తిగత విరాళం ప్రకంచారు.


కార్మికుల భద్రతే లక్ష్యం: మంత్రి వాసం శెట్టి సుభాష్

vasamshetti.jpg

అనకాపల్లి జిల్లా: ఏపీలో కార్మికుల భద్రతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ (Vasamsetti Subhash) తెలిపారు. ఇవాళ అనకాపల్లి జిల్లాలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ... అనకాపల్లి జిల్లాలో అధికంగా ప్రమాదకర రసాయన పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. వీటిలో భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోనే తొలిసారిగా భద్రతా వారోత్సవాలను ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కార్మికుల భద్రతను గాలికి వదిలేసిందని విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వానికి పరిశ్రమల యాజమాన్యం ఎంత ముఖ్యమో.. ఇక్కడ పనిచేసే కార్మికుల భద్రతా అంతే ముఖ్యమని చెప్పారు. భద్రతా చర్యలతో కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి వాసం శెట్టి సుభాష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Anil Video: బోరుగడ్డ అనిల్ వీడియోపై పోలీసుల సీరియస్

Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ

Minister Ram Prasad : క్రీడాభివృద్ధికి సహకరించండి

Read Latest AP News and Telugu News

Updated Date - Mar 09 , 2025 | 01:50 PM