Minister Ramanaidu: ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు.. మంత్రి నిమ్మల విసుర్లు
ABN , Publish Date - Apr 28 , 2025 | 02:33 PM
Minister Nimmala Ramanaidu: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రైతు సమస్యలను పరిష్కరించడంలో జగన్ విఫలం అయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.

పశ్చిమగోదావరి: ఏపీలో ఐదేళ్లపాటు వ్యవసాయ రంగాన్ని మూతవేసిన వైసీపీ వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇవాళ(సోమవారం) పాలకొల్లు మండలం లంకలకోడేరు, వెంకటాపురం గ్రామాల్లో కాలవగట్లను రహదారులుగా మార్చే పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో రైతులను పూర్తిగా విస్మరించిన జగన్‌కు, ఆ పార్టీకి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతుల రహదారుల కోసం ఒక్క తట్ట కంకర వేయలేదని మండిపడ్డారు. కాల్వల్లో ఒక తట్ట పూడిక మట్టి తీసింది లేదని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రానికి వైసీపీ అవసరం లేదని.. ఆ పార్టీకి ఓట్లు అడిగి అర్హత లేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు.
చెత్త సేకరణకు ప్రాధాన్యం: మంత్రి నారాయణ
విజయవాడ: చెత్త సేకరణకు మున్సిపల్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. ఇవాళ(సోమవారం) స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్‌పై ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్ షాప్‌నకు మంత్రి నారాయణ, కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీల్లో సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ తొలగించడం ఎంతో సవాల్‌తో కూడినదని అన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో 6500 టన్నుల సాలిడ్ వేస్ట్ ప్రతి రోజూ వస్తుందని చెప్పారు. ఏరోజు కారోజు ఈ చెత్తనంతా తొలగించాలని అన్నారు. గత జగన్ ప్రభుత్వం 80 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్లిందని మంత్రి నారాయణ అన్నారు.
ఈ చెత్తనంతా వచ్చే అక్టోబర్ 2వ తేదీ నాటికి తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ తెలిపారు. ప్రతి మూడో శనివారం స్వచ్చంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తూ స్వయంగా సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారని గుర్తుచేశారు. స్వచ్ఛత ప్రాధాన్యం తెలిసేలా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజలకు అవగాహన ఎలా కల్పించాలి.. ఎలాంటి ప్రచారం నిర్వహించాలనే దానిపై అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. దేశంలో ఎక్కడికి వెళ్తున్నా అక్కడ వ్యర్థాల విషయంలో ఆయా ప్రభుత్వాలు తీసుకున్న ఉత్తమ విధానాలను ఏపీలో అమలు చేసేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. నాలుగు థీమ్‌లుగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చెత్తపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించడం, రీసైక్లింగ్‌పై చైతన్యం కలిగించాలని అన్నారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసే అలవాట్లు మార్పు చేయడం లాంటివి చేపట్టాలని మంత్రి నారాయణ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
మీ ఇంట్లో ఏపీ ఉందా.. అయితే ఈ జాగ్రర్తలు పాటించండి..
For More AP News and Telugu News