Minister Narayana: ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:15 PM
Minister Narayana: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి నారాయణ చర్చించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు.

అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఇవాళ (బుధవారం) మంత్రి నారాయణ పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ రాజధాని అమరావతిలో మే2వ తేదీన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోదీ సభకు వచ్చే రహదారులను పరిశీలించారు. గుంటూరు, ఏలూరు, విజయవాడ ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించి రహదారి మార్గాల విషయంలో అధికారులకు మంత్రి సూచనలు చేశారు. కొన్ని రోడ్లు వెంటనే. వేడల్పు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు.
ట్రాఫిక్..ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో రూ.64 వేల కోట్ల విలువైన టెండర్లు పిలిచామని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే నెల 2వ తేదీన మళ్లీ రాజధాని పనులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రీ లాంచ్ జరుగుతుందని చెప్పారు. వచ్చే నెల 2వ తేదీన ప్రధాని మోదీ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. 5 లక్షల మంది ప్రజలు బహిరంగ సభకు హాజరవుతారనే అంచనా వేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.
రాజధానిలో కొన్ని రోడ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని మంత్రి నారాయణ అన్నారు. పోలీసుశాఖ సమన్వయంతో సీఆర్డీఏ సిబ్బందితో రాజధాని ప్రాంతంలో పర్యటన చేశామని తెలిపారు. 8 రోడ్డు మార్గాల్లో సభకు చేరుకోవచ్చని అన్నారు. తాడికొండ, హరిశ్చంద్రపురం, ప్రకాశం బ్యారేజ్ ఇలా కొన్ని మార్గాల్లో సభకు చేరుకునే విధంగా ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. 11 ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని అన్నారు. ప్రధాని హెలీప్యాడ్‌లో దిగిన తర్వాత సెక్యూరిటీ సూచనల ప్రకారం ఒక కిలోమిటర్ వరకు రోడ్ షో ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Andhra Pradesh Liquor Scam: జగన్ చెప్పారు.. నేను చేశాను!
PSR Anjaneyulu: అరెస్టు చేసినా అదే బాసిజం
Chandrababu Naidu: కేంద్రమంత్రి మేఘవాల్ ఇంట్లో ‘సైకిల్’పై చర్చ
Heatwave: ఎండదెబ్బకు ఒక్క ప్రాణమూ పోకూడదు
Read Latest AP News And Telugu News