Share News

AP DGP Harish Kumar Gupta: ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

ABN , Publish Date - May 26 , 2025 | 08:47 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను సీఎం నారా చంద్రబాబునాయడు నియమించారు. ఇవాళ్టి నుంచి రెండు సంవత్సరాల పాటు డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగనున్నారు.

AP DGP Harish Kumar Gupta: ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
Harish Kumar Gupta

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను (Harish Kumar Gupta) ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు (CM Nara Chandrababu Naidu) నియమించారు. ఇవాళ్టి నుంచి రెండు సంవత్సరాల పాటు డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్యానెల్ నుంచి హరీష్ కుమార్ గుప్తా పేరును సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఏపీ ఇన్‌చార్జి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ఉన్న విషయం తెలిసిందే. ఈమేరకు ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా కొనసాగనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

మళ్లీ అనారోగ్యం.. జీజీహెచ్‌కు వల్లభనేని వంశీ

సర్పంచ్ వేధింపులు.. ప్రాణహానీ అంటూ మహిళ ఫిర్యాదు

Read Latest AP News And Telugu News

Updated Date - May 26 , 2025 | 08:56 PM