AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - Feb 06 , 2025 | 09:33 AM
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశ మరి కాసేపట్లో ప్రారంభకానుంది. ఈ బేటిలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనల గురించి ఈ సమావేశంలో మాట్లాడనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ(గురువారం) ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన పారిశ్రామిక ప్రతిపాదనలకు కేబినెట్‌లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
రూ.44,776 కోట్లతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయనున్నారు. పంప్డ్ స్టోరేజి, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో సవరించిన రిజిస్ట్రేషన్ విలువలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 22 ఏ ఫ్రీ హోల్డ్ భూములపై ఆయా జిల్లాల్లో స్టేటస్ నోట్‌ను మంత్రివర్గానికి మంత్రులు సమర్పించనున్నారు. ఉగాది నుంచి పీ4 విధానం అమలు అంశంపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. ఉన్నత విద్యామండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేసే అంశంపై కేబినెట్‌లో చర్చించనున్నారు. సాంకేతిక విద్య, ఐసెట్, లాసెట్ లాంటి పరీక్షల నిర్వహణను అప్పగించేలా ప్రతిపాదన చేయనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.
పోలవరం నిర్వాసితులకు రిహబిలిటేషన్ అంశంపై క్యాబినెట్లో చర్చించారు. త్వరలో పునరావాసానికి మరిన్ని నిధులు విడుదలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏడేళ్ల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ. 800 కోట్ల నిధులను పునరావాసానికి విడుదల చేశారు. తాజాగా కూటమి సర్కార్ మరో రూ.1000 కోట్లు పునరావాసానికి పరిహారంగా విడుదల చేయనున్నారు. పునరావాసాన్ని వీలున్నంత త్వరగా పూర్తిచేసి 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. దీంతో క్యాబినెట్‌లో ఈ అంశంపై కీలక చర్చ జరగనుంది. నీరు చెట్టు కార్యక్రమానికి బడ్జెట్ కేటాయింపుపై క్యాబినెట్లో మాట్లాడనున్నారు. నీరు చెట్టు బిల్లులు చెల్లింపుపైన క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP: వైసీపీ నేత అరాచకం.. ఏకంగా కిడ్నాప్ చేసి.. ఏం చేశారంటే..
MP Magunta Srinivasulu Reddy: ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అస్వస్థత
ABN ఎఫెక్ట్ : ‘అక్షరమే ఆయుధంగా - పరిష్కారమే అజెండా’కు అనూహ్య స్పందన
Government Hospitals: రోగుల సంతృప్తే ప్రధానం
Read Latest AP News and Telugu News