CM Chandrababu: తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 30 , 2025 | 02:55 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, నవంబరు30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఇవాళ(ఆదివారం) తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.
పేదల సేవలో కార్యక్రమంలో నేతలు అందరూ పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో నిరంతరం ఉంటేనే మంచి రాజకీయ నేతలుగా రాణించగలరని సూచించారు. ప్రజల కష్ట, నష్టాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఫించన్ల పంపిణీలో అందరూ నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని.. ఇది పేదల సేవగా భావించాలని సూచించారు. ఫింఛన్ల పంపిణీలో నేతలు భాగస్వామ్యంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఏలూరు జిల్లాలో సీఎం పర్యటన..
కాగా, ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు రేపు(సోమవారం) పర్యటించనున్నారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్నారు. అనంతరం గొల్లగూడెంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ముఖాముఖిలో కార్యకర్తలతో పలు అంశాలపై మాట్లాడనున్నారు. అలాగే, నల్లమాడులో జరిగే ప్రజావేదికలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఔటర్ చుట్టూరా.. మెట్రో నిర్మిస్తే ఎంతో ప్రయోజనం
భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?
Read Latest AP News and National News