CM Chandrababu: సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:02 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు. 27వ తేదీ ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్‌పోర్టుకు సీఎం చంద్రబాబు బృందం చేరుకోనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సింగపూర్ పర్యటన (Singapore visit) షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ (శనివారం జులై 26) రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరనున్నారు. 27వ తేదీ ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు బృందం చేరుకోనుంది. సీఎం చంద్రబాబుతోపాటు సింగపూర్ పర్యటనలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి.నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌తో పెట్టుబడుల సాధన కోసం రేపటి నుంచి ఐదు రోజులపాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు.
ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. మొదటి రోజు సింగపూర్‌లో తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొంటారు. సింగపూర్‌తోపాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ సహా పలు దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడుదారులు, ఉద్యోగులు హాజరుకానున్నారు. AP NRT ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి దాదాపు 1,500మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సింగపూర్‌లోని వన్‌వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగే సదస్సుకు AP NRT, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిరుద్యోగ యువతకు ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై సీఎం చంద్రబాబు బృందం చర్చించనున్నారు. వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారిని ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు చేయడం వంటి తదితర అంశాల గురించి ఈ సమావేశంలో మాట్లాడనున్నారు. జీరో పావర్టీ P-4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలను కోరనున్నారు. పలు దేశాలకు ఏపీ నుంచి ఎగుమతులు పెంచడానికి ఎన్నారైల ద్వారా అవసరమైన ప్రణాళికలు అమలు చేయడంపైనా చర్చించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడంపై మాట్లాడనున్నారు. స్పోర్ట్స్, పోర్ట్స్ సహా వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సీఎం చంద్రబాబు బృందం సందర్శించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అనుమానాలొద్దు.. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తాం
రోడ్ సేఫ్టీకి మాదిరెడ్డి ప్రతాప్
Read latest AP News And Telugu News