Share News

Sajjala Ramakrishna Reddy: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు

ABN , Publish Date - Jun 22 , 2025 | 05:42 PM

వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో రాజధాని దళిత జేఏసీ నేత కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.

Sajjala Ramakrishna Reddy: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు
YSRCP Leader Sajjala Ramakrishna Reddy

అమరావతి: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై (Sajjala Ramakrishna Reddy) క్రిమినల్ కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో రాజధాని దళిత జేఏసీ నేత కంభంపాటి శిరీష (Kambhampati Sirisha) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు రాజధాని మహిళలపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు రాజధాని మహిళలు నిరసన వ్యక్తం చేశారు.


నిరసన వ్యక్తం చేసిన వారు సంకరజాతి వారని సజ్జల చేసిన వ్యాఖ్యలపై శిరీష ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్‌ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆశ్రయించారు. అయితే సజ్జలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు వీలు లేదని హైకోర్ట్‌లో శిరీష తరపున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ ఇంప్లీడ్ పిటీషన్ వేశారు. ఈ రోజు ఉదయం కేసు రిజిస్టర్ కావడంతో పోలీసుల చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి:

గంజాయి తనిఖీలకు వెళ్లి.. కానిస్టేబుల్ మృతి

డిప్యూటీ సీఎంపై అనుచిత పోస్టులు..

విశాఖ యోగాకు గిన్నిస్ బుక్‌లో స్థానం

For More AP News and Telugu News

Updated Date - Jun 22 , 2025 | 05:48 PM