Share News

Somu Veerraju: జగన్‌ నీ విధానం మార్చుకో.. సోము వీర్రాజు స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:35 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలని.. లేకపోతే తాము తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు.

Somu Veerraju: జగన్‌ నీ విధానం మార్చుకో..  సోము వీర్రాజు స్ట్రాంగ్ వార్నింగ్
BJP MLC Somu Veerraju

రాజమండ్రి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు (BJP MLC Somu Veerraju) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలని.. లేకపోతే తాము తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఏపీలో తాము మళ్లీ అధికారంలోకి వస్తాం.. అధికారుల అంతం చూస్తామంటూ జగన్ అజ్ఞానరహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారులను జగన్ ఏమీ చేయలేరని వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు జైలుకి వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ(శనివారం) రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయంలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు ఆరోగ్యాలు పాడైపోయాయని అన్నారు సోము వీర్రాజు.


వైసీపీ ప్రభుత్వంలో రూ.420కి నెయ్యి కొని తిరుపతిలో లడ్డూ తయారు చేశారని సోము వీర్రాజు ఆరోపించారు. అధికారంలోకి జగన్ మళ్లీ వస్తే నెయ్యి రూ.320కి కొంటారా అని ప్రశ్నించారు. జగన్ పరిపాలనలోని వైఫల్యాలనే తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎందుకు జైలుకి వెళ్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. వైసీపీ పరిపాలనలోని లోపాలు ఆ పార్టీ నేతలకి అర్థం కావటం లేదా అని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్రలో వైసీపీ నేతలు ఏం చేయించారో.. ఒకసారి రికార్డులు వెనక్కి తీయిస్తే వారు చేసిన అరాచకాలు బయటపడుతాయని చెప్పుకొచ్చారు. జగన్ ప్రతిపక్ష నేతగా కూటమి ప్రభుత్వాన్ని బెదిరిస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మరని.. మళ్లీ మీరు అధికారంలోకి రావడం కళే అని విమర్శించారు సోము వీర్రాజు.


2029లో కూడా మళ్లీ కూటమి అధికారంలోకి వస్తుందని సోము వీర్రాజు జోస్యం చెప్పారు. వైసీపీ పాలనలో రోడ్డుపై ఒక్క గోయ్యి కూడా ఎందుకు పూడ్చలేదని ప్రశ్నించారు. జగన్ పాలనలో రమ్మీలు ఆడించారని ఆరోపించారు. గతంలో తనను గుడివాడ కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. తనకు రామతీర్థం నుంచి కపిలం తీర్థం వెళ్లటానికి కూడా జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అప్పులు చేయటం జగన్‌కే బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి రోజూ ఢిల్లిలో ఎందుకు ఉండేవారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీపై ఉన్న గౌరవమే తెలంగాణపైనా ఉందని స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బనకచర్లకు అనుకూలంగా మాట్లాడాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అన్యమత ఉద్యోగులని సస్పెండ్ చేసిన టీటీడీ

ఏపీలో అమానుష ఘటన.. భార్యని హత్య చేసిన భర్త

Read latest AP News And Telugu News

Updated Date - Jul 19 , 2025 | 12:47 PM