Satyakumar Yadav: జగన్ హయాంలో హత్యలు చేసి డోర్ డెలివరీ చేశారు: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Nov 17 , 2025 | 01:34 PM
కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి చేస్తోందని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్‌ని వికసిత్ భారత్‌గా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
విజయవాడ, నవంబరు17 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ (AP Minister Satyakumar Yadav) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఇవాళ(సోమవారం) విజయవాడలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో హత్యలు చేసి డోర్ డెలివరీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసిందని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్‌ని వికసిత్ భారత్‌గా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈనేపథ్యంలోనే రూ.87 కోట్లని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. 740 ఏకలవ్య మోడల్ స్కూల్స్ తీసుకువచ్చి గిరిజన విద్యార్థుల విద్యని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సోళ్ల బుజ్జిరెడ్డికి ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పదవీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అవగాహన కలిగిన అనుభవం ఉన్న వాళ్లని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎంపిక చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వందకుపైగా పైరసీ వెబ్‌సైట్లు.. రవి నెట్‌వర్క్‌లో షాకింగ్ విషయాలు
సౌదీ అరేబియా ఘటన.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించండి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News