AP High Court: పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:21 AM
పరకామణి చోరీ కేసుని ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో కేసుపై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి, నవంబరు18(ఆంధ్రజ్యోతి): పరకామణి చోరీ కేసు (Parakamani Theft Case)లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏవీఎస్‌వో వై.సతీశ్ కుమార్ మృతి నేపథ్యంలో... ఈ కేసులో నిందితుడు రవికుమార్, ఇతర సాక్షులకు భద్రత కల్పించాలని ఆదేశించింది. అప్పటి ఏవీఎస్‌వో సీఐ స్థాయి అధికారి సతీశ్ కుమార్ అసహజ మరణ వార్త విని షాక్ గురయ్యామని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో తన పర్యవేక్షణలోనే కిందిస్థాయి సీఐడీ అధికారులు కూడా కేసును దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని కోరుతూ సీఐడీ డీజీ మెమో దాఖలు చేశారు. ఈ విషయంలో సీఐడీ డీజీ అభ్యర్థన మేరకు అంగీకరించింది న్యాయస్థానం. తదుపరి విచారణను డిసెంబరు 2వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మందికి గాయాలు..
Read Latest AP News And Telugu News