Share News

CM Chandrababu: బిజీబిజీగా సీఎం చంద్రబాబు షెడ్యూల్.. ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటన

ABN , Publish Date - Apr 11 , 2025 | 08:28 AM

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఏలూరు, కడప రెండు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

CM Chandrababu: బిజీబిజీగా సీఎం చంద్రబాబు షెడ్యూల్.. ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటన
CM Chandrababu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్ర, శనివారాలు బిజీబిజీగా ఉండనున్నారు. ఏలూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఇవాళ, రేపు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో ఆగిరిపల్లి మండలం వడ్లమానుకు సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. 10.20కి సీఎం చంద్రబాబుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలకనున్నారు. పదిన్నరకు బీసీ వర్గాల ప్రజలతో సీఎం చంద్రబాబు మాట్లాడతారు.


11:30కు ప్రజావేదిక వద్ద ముఖాముఖి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. 1 గంటకు టీడీపీ కేడర్‌తో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహిస్తారు. ఈ మీటింగులో పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. తిరిగి రెండున్నరకు హెలికాప్టర్‌లో బయలుదేరి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. మూడున్నరకు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తారు. నాలుగున్నరకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం ఐదు గంటలకు ఒంటిమిట్ట టీటీడీ గెస్ట్‌‌హౌస్‌కు సీఎం చంద్రబాబు చేరుకుంటారు.


కోదండ రామస్వామికి సాయంత్రం 6 గంటల నుంచి 6:30 మధ్య పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం చంద్రబాబు సమర్పిస్తారు. 6:45 నుంచి 8:30 వరకు సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొంటారు. 8:40కి తిరిగి టీటీడీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని.. అక్కడే రాత్రి బస చేస్తారు. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి విజయవాడ బయలుదేరుతారు. 10:30కు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఫోటోషూట్లలోనే ఇదో కొత్త తరహా..

Madhav Police Clash: పోలీసులపై గోరంట్ల మాధవ్‌ దౌర్జన్యం

Purandeswari: పోలీసులకు జగన్‌ క్షమాపణ చెప్పాలి

Nimmala Ramanaidu: జగన్‌ నుంచే ప్రజలకు భద్రత కావాలి

Jagan : చంద్రబాబూ చర్యకు ప్రతిచర్య తప్పదు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 11 , 2025 | 08:52 AM