Share News

TTD: భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Jul 22 , 2025 | 02:57 PM

తిరుమల తిరుపతి పాలకమండలి మంగళవారం సమావేశం అయింది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలక మండలిలో తీసుకున్ననిర్ణయాలను మీడియాకు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణంపై చర్చించామని తెలిపారు.

 TTD: భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
TTD Key Decisions

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి (TTD) ఇవాళ(మంగళవారం జులై22) సమావేశం అయింది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు (TTD Key Decisions) తీసుకుంది. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shyamala Rao) వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణంపై చర్చించామని... కమిటీ నివేదిక మేరకు ఈ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సామాన్య భక్తులకు అదనంగా వసతి సదుపాయలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అలిపిరి వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు ఓ కమిటీని నియమించనున్నట్లు ప్రకటించారు టీటీడీ ఈవో శ్యామలరావు.


శిలాతోరణం, చక్రతీర్ధం అభివృద్ధి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణ అధ్యాయనానికి ఓ కమిటీ వేయనున్నట్లు వివరించారు. శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసే విధంగా కో ఆర్డినేటర్ల నియామకానికి ఆమోదం తెలిపారు. సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదించారు. కల్యాణకట్టల వద్ద పారిశుద్ధ్యం పెంపునకు, తిరుమలలో పరిపాలన భవనాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. పాత భవనాలని తొలగించి వాటి స్థానంలో నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని ఆమోదించారు.


ఒంటిమిట్ట ఆలయంలో త్వరలోనే అన్నదానం ప్రారంభించనున్నారు. రూ. 4.7 కోట్లతో అన్నదానం కోసం నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు. 320 ఆలయాలకు మైక్ సెట్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 700 మంది వేద పారాయణదారుల నియామకానికి ఆమోదం తెలిపారు. ఇందుకోసం రూ.18కోట్ల నిధులు కేటాయించనున్నారు. 600 మంది వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఆమోదించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఏపీలోని పలు దేవాలయాల వద్ద భజన మండలాల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.


ఇవీ చదవండి..

ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి ఎమోషనల్.. మద్యం వ్యాపారంపై తండ్రి చెప్పినట్టు..

ప్రజాప్రతినిధులపై మరోసారి రెచ్చిపోయిన రోజా

For More AP News and Telugu News

Updated Date - Jul 22 , 2025 | 03:41 PM