Bhanuprakash Reddy: పరకామణి కేసులో దోషులు జైలుకెళ్లక తప్పదు: భానుప్రకాష్ రెడ్డి
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:32 PM
శ్రీవారి ఖజానాను దోచుకున్న కరుణాకర్ రెడ్డి అండ్ కోని కచ్చితంగా శిక్షిస్తారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. పరకామణి విషయంలో దొంగలను తీసుకెళ్లి లోకాయుక్తలో వారెలా రాజీ చేస్తారని ప్రశ్నించారు భానుప్రకాష్ రెడ్డి.
విజయవాడ, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): పరకామణి కేసు (Parakamani case)పై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి (Bhanuprakash Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పరకామణి విషయంలో దోషులు జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు. దొంగను దాతగా చేశారని... దొంగతనాన్ని కానుకగా మార్చారని ఆరోపించారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి అండ్ కో నీతిమంతుల్లాగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇవాళ(శుక్రవారం) విజయవాడ వేదికగా మీడియాతో మాట్లాడారు భానుప్రకాష్ రెడ్డి.
పరకామణి విషయంలో దొంగలను తీసుకెళ్లి లోకాయుక్తలో కరుణాకర్ రెడ్డి ఎలా రాజీ చేస్తారని ప్రశ్నించారు. శ్రీనివాసుడు ఉగ్ర నరసింహుడు అయ్యారని.. తన ఖజానాను దోచుకున్న కరుణాకర్ రెడ్డి అండ్ కోని శ్రీవారు కచ్చితంగా శిక్షిస్తారని వార్నింగ్ ఇచ్చారు భానుప్రకాష్ రెడ్డి.
కరుణాకర్ రెడ్డి అండ్ కో పరకామణి కేసు విషయంలో సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే కరుణాకర్ రెడ్డి అండ్ కో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆరోజు పరకామణి విషయంలో తీర్మానాలు చేస్తూ సంతకాలు చేసింది కరుణాకర్ రెడ్డి కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. పరకామణి చాలా సున్నితమైన అంశమని.. భక్తులు కరుణాకర్ రెడ్డి చెప్పే అబద్దాలని నమ్మొద్దని సూచించారు. వడ్డీకాసుల వాడు... వడ్డీతో సహా... కరుణాకర్ రెడ్డి అండ్ కోకు చెల్లించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
ఆనందక్షణాలను సీఎంతో పంచుకున్న శ్రీచరణి
అక్టోబర్‌లో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..
Read Latest AP News And Telugu News