Share News

PM Narendra Modi: మరోసారి ఏపీకి ప్రధాని మోదీ.. అసలు విషయమిదే..

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:17 AM

పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

PM Narendra Modi: మరోసారి ఏపీకి ప్రధాని మోదీ.. అసలు విషయమిదే..
PM Narendra Modi

శ్రీ సత్యసాయి జిల్లా, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): పుట్టపర్తి సత్యసాయి బాబా ( Puttaparthi Sathya Sai Baba) శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు.


వీవీఐపీల రాక సందర్భంగా ఏపీ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 19వ తేదీన ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) చేరుకోనున్నారు. ఉదయం 8 గంటలకు విమానాశ్రాయానికి ప్రధాని రానున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ప్రధాని ప్రత్యేక కాన్వాయిలో ప్రశాంతి నిలయం చేరుకుంటారు. ప్రశాంతి నిలయం సాయి కుల్వంత్ సభ మందిరంలో జయంత్యుత్సవాల సందర్భంగా సత్యసాయిబాబా మహా సమాధిని మోదీ దర్శించుకుంటారు.


అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన శతజయంతి వేడుకల్లో పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. మోదీతో కలిసి చంద్రబాబు, పవన్, నారా లోకేశ్‌తోపాటు జయంత్యుత్సవాల కమిటీ, ఏపీ మంత్రుల బృందం ఈ వేడుకల్లో పాల్గొంటారు. అదేవిధంగా 22వ తేదీన సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథి హోదాలో భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ‌న్ హాజరవుతారు. బందోబస్తులో భాగంగా 2500 మంది పోలీసు బలగాలను మోహరించింది ప్రభుత్వ యంత్రాంగం.


ఈ వార్తలు కూడా చదవండి..

వందకుపైగా పైరసీ వెబ్‌సైట్లు.. రవి నెట్‌వర్క్‌లో షాకింగ్ విషయాలు

సౌదీ అరేబియా ఘటన.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించండి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 17 , 2025 | 11:45 AM