Payyavula Slams Jagan: జగన్ రోడ్డు మీదకొస్తే తలకాయలు.. మామిడికాయలు పగలాల్సిందే: మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Jul 11 , 2025 | 02:57 PM
Payyavula Slams Jagan: బంగారుపాళ్యంలో ట్రాక్టర్ లాక్కొచ్చి మరీ వైసీపీ చేసిన ట్రిక్స్ అన్నీ డ్రోన్ కెమెరాల్లో బయటపడ్డాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెటకారం తగ్గించుకుంటే మంచిదని హితవుపలికారు.

అనంతపురం, జులై 11: లిక్కర్ స్కామ్‌కు (AP Liquor Scam) సంబంధించి సిట్ దర్యాప్తులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) అన్నారు. ఈరోజు (శుక్రవారం) జిల్లాలోని కనేకల్ మండల కేంద్రంలో నిర్వహించిన సుపారిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కామ్‌కు ఐఐటీ ప్రొఫెషనల్స్, ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని బాక్సులకు బాక్సులు డబ్బులు తరలించారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో వాస్తవాలు తెలిస్తే భారతదేశం నివ్వరు పోయే విధంగా ఉందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా మెయిల్స్ చేసిన ఉదయ భాస్కర్‌పై కేసులు పెట్టి తీరతామని స్పష్టం చేశారు. ఉదయ భాస్కర్ దాదాపు 200 తప్పుడు మెయిల్స్ పెట్టారని మండిపడ్డారు.
బంగారుపాళ్యంలో ట్రాక్టర్ లాక్కొచ్చి మరీ వైసీపీ చేసిన ట్రిక్స్ అన్నీ డ్రోన్ కెమెరాల్లో బయటపడ్డాయన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెటకారం తగ్గించుకుంటే మంచిదని హితవుపలికారు. బుగ్గన నోటికి వచ్చినట్లు పార్టీలో అస్తిత్వం కోసం మాట్లాడుతున్నారని.. ఇప్పటికైనా బుర్రకథలు ఆపాలన్నారు. దోమల మీద యుద్ధం, గాల్లో యుద్ధం మీరు చేశారని... అందుకే ప్రజలు కాల్చివాత పెట్టారని ఎద్దేవా చేశారు. దొంగ ఈ-మెయిల్స్ పంపిన వారిపై కేసు పెడతామని స్పష్టం చేశారు. జగన్ రోడ్డు మీదకు వస్తే ఆయన కారు కింద తలకాయలు కానీ.. మామిడికాయలు కానీ పగలాల్సిందే అంటూ దుయ్యబట్టారు. చిత్తూరులో మామిడికాయలు కొనొద్దని ఫ్యాక్టరీలకు చెప్పారని.. ట్రాక్టర్‌ల నుంచి బలవంతంగా మామిడికాయలు కింద పారబోశారని... చివరికి డ్రోన్ కెమెరాలో దొరికి పోయారని విమర్శించారు. పెట్టుబడులు పెట్టవద్దని చెప్పారని మండిపడ్డారు. మెయిల్స్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసే విధంగా చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
కాగా.. సుపారిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పయ్యావులతో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ గడిచిన సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు మంత్రి, ఎమ్మెల్యే తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
కాకినాడ జీజీహెచ్ ఘటన.. వారిపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం
టీటీడీలో ఆ ఉద్యోగులను తక్షణమే తొలగించాలి.. బండి సంజయ్ డిమాండ్
Read Latest AP News And Telugu News