Share News

Harassment Case: ఏపీలో అమానుషం.. విద్యార్థినులపై లైంగిక వేధింపులు

ABN , Publish Date - Jul 11 , 2025 | 10:23 AM

కాకినాడ జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాలలో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులని ల్యాబ్ టెక్నీషియన్ లైంగిక వేధింపులకి గురిచేశాడు. బీఎస్సీ, ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినులపై ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి వికృత చేష్టలకి పాల్పడ్డాడు.

Harassment Case: ఏపీలో అమానుషం.. విద్యార్థినులపై లైంగిక వేధింపులు
Harassment Case

కాకినాడ: జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాలలో (Rangaraya Medical College) కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులని ల్యాబ్ టెక్నీషియన్ లైంగిక వేధింపులకి గురిచేశాడు. బీఎస్సీ, ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినులపై ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి వికృత చేష్టలకి పాల్పడ్డాడు. శరీరాన్ని అసభ్యకరంగా తాకడం, బుగ్గలను నిమరడం వంటి జుగుప్సాకరమైన చేష్టలు చేస్తూ తమకు నరకాన్ని చూపించారని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు.


విధుల్లో నిమగ్నమై ఉండగా అసభ్యకరమైన ఫొటోలు తీసి పలువురి వాట్సాప్‌లకు పంపించేవాడని.. రూమ్‌కి రమ్మని బెదిరించేవాడని, డబ్బులు ఎరవేసేవాడని బాధిత విద్యార్థినులు కళాశాల ప్రిన్సిపల్‌ డా.విష్ణువర్ధన్‌కి ఫిర్యాదు చేశారు. ఈనెల(జులై) 8వ తేదీన విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో అంతర్గత కమిటీతో కళాశాల ప్రిన్సిపల్‌ విచారణ జరిపించారు.


మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో కొంతమంది సిబ్బంది తమ పట్ల అసభ్యంగా వ్యవహారించారని 50మంది విద్యార్థినులు విచారణ కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ నివేదిక రాగానే చర్యలు చేపడతామని ప్రిన్సిపల్ డా.విష్ణువర్ధన్ తెలిపారు. యువతులపై వేధింపుల ఘటన బయటకు రావడంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నారా.. యువతకు ఆంధ్రజ్యోతి ఆహ్వానం

పీ-4 అమలుకు కీలక ప్రణాళికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 11 , 2025 | 12:01 PM