Share News

CM Chandrababu On Eucation: కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్.. ఇది నా బాధ్యత: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 10 , 2025 | 01:30 PM

CM Chandrababu On Eucation: ఆడ బిడ్డల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చానని.. రిజర్వేషన్‌లలో మహిళకు పెద్ద పీట వేశానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం డబ్బులు ఇచ్చి చదువు చెప్పించే బాధ్యత తనది అని స్పష్టం చేశారు.

CM Chandrababu On Eucation: కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్.. ఇది నా బాధ్యత:  సీఎం చంద్రబాబు
CM Chandrababu On Eucation

పుట్టపర్తి, జులై 10: రెండోసారి ఘనంగా మెగా పీటీఎం (Mega PTM) కార్యక్రమం జరుపుకోవడం ఒక చరిత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. కొత్తచెరువు జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన మెగా పీటీఎం సమావేశంలో సీఎం పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు పాఠం చెప్పారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కొత్త చెరువు జెడ్పీ హై స్కూల్ ఆధునిక దేవాలయమని.. జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రమని చెప్పుకొచ్చారు. ఇక్కడ చదుకున్న పూర్వ విద్యార్థులు తమ వంతుగా పాఠశాలను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ‘నా టీచర్‌ను ఎప్పుడూ మరిచిపోలేదు. 1978లో నేను ఎమ్మెల్యే అయ్యాను. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఏనాడు పేరెంట్స్ మీటింగ్‌కు వెళ్లలేదు. నారా లోకేష్ చదువు బాధ్యతను నా సతీమణి తీసుకుంది’ అని తెలిపారు.


ఆ పాఠశాలల్లో నో వేకెన్సీ..

ఆడ బిడ్డల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చానని.. రిజర్వేషన్‌లలో మహిళకు పెద్ద పీట వేశానని గుర్తుచేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం డబ్బులు ఇచ్చి చదువు చెప్పించే బాధ్యత తనది అని స్పష్టం చేశారు. నారా లోకేష్ విద్యా శాఖను ఏరికోరి మనస్పూర్తిగా తీసుకున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్కూల్స్‌కు ధీటుగా అభివృద్ధి చేసే బాధ్యత తనది అని తెలిపారు. నెల్లూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నో వేకెన్సీ అని బోర్డులు పెట్టారని.. ఇది చూసి చాలా సంతోషంగా అనిపించిందని హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే అన్ని పాఠశాలల్లో కనపడాలని సీఎం అన్నారు.


లోకేష్‌కు అభినందనలు..

లీప్ యాప్‌ను తల్లిదండ్రులు డౌన్ లోడ్ చేసుకోవాలని... ఎవరైనా పిల్లలు స్కూల్‌కు డుమ్మా కొడితే పదిన్నర గంటలకే పేరెంట్స్‌కు మెసేజ్ వెళ్తుందన్నారు. లీప్ యాప్‌ను రూపొందించిన మంత్రి లోకేష్‌ను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. పిల్లల స్కూల్ బ్యాగ్‌లపై గత ప్రభుత్వంలో బొమ్మలు వేసుకున్నారని.. బడుల్లో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం స్కూల్స్‌లో మధ్యాహ్న బోజనం రద్దు చేసిందన్నారు. విద్యార్థి దశలో అన్నం పొట్లం కట్టుకొని వాగులు వంకలు దాటుకొని నడుచుకుంటూ బడికి వెళ్లే వాడినని గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని... సన్న బియ్యంతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి.


వాటికి దూరం కాకపోతే సంక్షేమ పథకాలు కట్...

ఎవరైనా గంజాయి సాగు చేసినా అమ్మినా అదే వారికి చివరి రోజు అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. గంజాయికి దూరం కాకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తల్లి పట్ల భక్తి భావం పెరగాలని తల్లికి వందనం పేరు పెట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క టీచర్‌ను కూడా నియమించ లేదని విమర్శించారు. బాత్రూంలో ఫోటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేసి వేధింపులకు గురి చేశారని... వాటిని రద్దు చేశామని చెప్పారు. ఆగస్టు లోపల డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి టీచర్స్ బడికి వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. 1995 ఆగస్టు 15 తేదీన మిడ్ డే మీల్స్ కార్యక్రమం ప్రారంభించామని.. విద్యార్థులకు ప్రతిభా అవార్డ్స్ ఇచ్చామన్నారు. పిల్లలకు ఎకరా రెండు ఎకరాలు ఆస్తి ఇవ్వడం కాదని.. బాగా చదివిస్తే కుటుంబం, సమాజం బాగుపడుతుందని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులను వారికి నచ్చిన కాలేజీలో చదువుకునేలా చూడాలని విద్యా శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

స్కూళ్లలో నో పాలిటిక్స్.. అంతా బయటే: మంత్రి లోకేష్

మెగా పీటీఎం.. స్టూడెంట్స్‌కు పాఠం చెప్పిన సీఎం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 10 , 2025 | 04:21 PM