PVN Madhav: రాయలసీమ అభివృద్ధికి కృషి .. పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 30 , 2025 | 10:33 AM
ఏపీలో రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతం నుంచి అనేకమంది ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు వచ్చినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కచ్చితంగా కృషి చేస్తోందని పీవీఎన్ మాధవ్ ఉద్ఘాటించారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (AP BJP Chief PVN Madhav) వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో పీవీఎన్ మాధవ్ ఇవాళ(బుధవారం జులై 30) పర్యటించారు. బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రాయలసీమలో తొలిసారిగా ఆయన పర్యటించారు. నగరంలో చాయ్ పే కార్యక్రమాన్ని మాధవ్ నిర్వహించారు. వివిధ వర్గాలతో కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడారు.
ఏపీలో రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిందని పీవీఎన్ మాధవ్ చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతం నుంచి అనేకమంది ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు వచ్చినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కచ్చితంగా కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. ఇక్కడ సాగునీటి వనరులు పెంచడం, ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పన వంటి వాటిపై కేంద్రప్రభుత్వం సాయం చేస్తోందని పేర్కొన్నారు. ఆగస్టు 30వ తేదీన సంచార జాతుల సదస్సు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. ఆయా వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని నొక్కిచెప్పారు. దేవుని గడప కడప నుంచి తన పర్యటన ప్రారంభించానని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
లిక్కర్ కుంభకోణంలో సంచలనం.. విచారణలో సిట్ దూకుడు
సింగపూర్‌లో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్.. పెట్టుబడులపై కీలక చర్చలు
Read latest AndhraPradesh News And Telugu News