Home » Ananthapuram
దేశ సరిహద్దులు దాటి సైబర్ నేరగాళ్లను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కాంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్‌లని ఆపరేట్ చేస్తున్న నేరగాళ్లను పోలీసులు గుర్తించారు. రాయదుర్గంకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అకౌంట్ నుంచి రూ.1.74కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారని ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టామని అనంతపురం ఎస్పీ జగదీష్ తెలిపారు.
ఏపీలో రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతం నుంచి అనేకమంది ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు వచ్చినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కచ్చితంగా కృషి చేస్తోందని పీవీఎన్ మాధవ్ ఉద్ఘాటించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాల్ మనీ అరాచకాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. మొన్న అనంతపురం, నేడు ధర్మవరంలో వడ్డీ వ్యాపారుల ఆకృత్యాలు వెలుగుచూశాయి. అనంతపురం నగరంలోని పాత ఊరిలో బంగారం వ్యాపారి బాబ్ జాన్‌ను వడ్డీ వ్యాపారులు చితకబాదారు.
చదువులకు సాయం చేసిన మాస్టారునే టార్గెట్ చేసింది ఓ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడం ప్రారంభించింది. టార్చర్ భరించలేక మాస్టారు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు అండగా నిలబడి పోలీసుల వద్దకు తీసుకెళ్లారు.
‘అమ్మా.. ఐ యామ్ వెరీ సారీ.. ఇక నీ కొడుకు లేడమ్మా.. జాగ్రత్తగా ఉండు.. మళ్లీ వస్తాను.. చెల్లి మానస కడుపున పుడతాను. నాకోసం మీరు ఉండాలి. నాన్నకు చెప్పు.. ప్లీజ్ మా... ఐ మిస్ యూ మా... లవ్ యూ మా...’ అంటూ తల్లికి వాట్సాప్ మెసేజ్ చేశాడు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం జరిగింది. పట్టణంలోని సాయి సిద్ధార్థ కాలేజీ సమీపంలో హర్ష అనే యువకుడిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిత్య పంపకాలే అన్నది బహిరంగ రహస్యమే. అక్కడ కీలకమైన సబ్ రిజిస్ట్రార్ పోస్టుపైనే అందరి దృష్టి ఉంటుంది. అందులోనూ కీలకమైన కార్యాలయాల్లో ఆ పోస్టుకుండే డిమాండ్ అంతాఇంతా కాదు. అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ పోస్టు కూడా ఆ కోవలోకే వస్తుంది.
నియోజకవర్గంలో వైసీపీకి సమన్వయకర్తలేక కార్యకర్తల్లో అయోమయం ఏర్పడింది. పార్టీ కార్యక్రమాలు చేపట్టేవారు లేరు, సమస్య వస్తే అండగా నిలిచేవారూ కరువయ్యారు. దీంతో వైసీపీ క్యాడర్ బలహీనపడుతోందని ఆ పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్దారెడ్డి ఫ్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆరా తీశారు. ఈ ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.