MLA Daggupati Venkateshwara Prasad: జగన్‌పై ఎమ్మెల్యే ఫైర్.. రూ. వెయ్యి పెంచేందుకు ఆయనకు ఐదేళ్లు పట్టింది
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:54 PM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఫైర్ అయ్యారు. రూ. వెయ్యి పెంచేందుకు ఆయనకు ఐదేళ్లు పట్టింది.. అంటూ విమర్శించారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారంటూ ఆయన దుయ్యబట్టారు.
- పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే దగ్గుపాటి విమర్శ
అనంతపురం: పింఛన్ సొమ్ము రూ.వెయ్యి పెంచేందుకు జగన్‌కు ఐదేళ్ల పట్టిందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్(MLA Daggupati Venkateshwara Prasad) విమర్శించారు. రాజీవ్ కాలనీ పంచాయతీలోని మరాఠీకాలనీ, 16వ డివిజన్‌లోని బాబానగర్, 38వ డివిజన్‌లోని కోవూరు నగర్‌లో ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వంలో రారష్ర్టానికి ఎలాంటి పెట్టుబడులు రాలేదని, ఆఖరికి విశాఖపట్నంలో ప్రభుత్వ ఆఫీసులను తాకట్టు పెట్టారని, ఆయన మరోసారి సీఎం అయి ఉంటే రాష్ర్టాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేవారని ఈ సందర్భంగా దుయ్యబట్టారు.
ఏడాదిలో నగర రూపురేఖలు మార్చేస్తాం
అనంతపురం క్లాక్‌టవర్: ఏడాదిలో నగర రూపురేఖలు మార్చేస్తామని, అందుకు ప్రణాళికను అమలు చేయబోతున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. 38వ డివిజన్‌లోని విద్యారణ్య పాఠశాల వద్ద రూ.39లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భూమిపూజ చేశారు. అలాగే 27వ డివిజన్‌లో రూ.70లక్షలతో పూర్తి చేసిన అశోక్‌నగర్ మెయిన్ రోడ్డును శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు.
కూటమి వచ్చాక నగరంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. గుంతల రోడ్లును బాగు చే స్తూ.. మురుగు కాలవల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఏడాదిలోపు నగర రూపురేఖలు మార్చే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ బా లస్వామి, ఎస్‌ఈ రాజశేఖర్, ఈఈ షాకీర్, ఎంపీడీఓ దివాకర్, మాంసాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకా్‌షనాయుడు, వీర శైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ స్వప్న,

టీడీపీ జిల్లా అధికారప్రతినిధి సరిపూటి రమణ, మాజీ కార్పొరేటర్ బల్లాపల్లవి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గాజుల ఆదెన్న, భావన, రాష్ట్ర కార్యదర్శులు ఆదినారాయణ, రాయల్‌మురళి, సుధాకర్‌నాయుడు, నెట్టెం బాలకృష్ణ, బీజేపీ నాయకుడు లలిత్‌కుమార్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే లక్ష్మీనరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్, ఉపాధ్యక్షుడు రమేష్, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు భవానీ రవికుమార్, పీఎల్‌ఎన్ మూర్తి, పోతుల లక్ష్మినరసింహులు, కడియాల కొండన్న, పరమేశ్వర్, శివ, పవన్‌తోపాటు నాయకులు పాల్గొన్నారు.
విధుల్లోకి తీసుకోవాలని వినతి
నగరపాలక సంస్థలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను వయోపరిమితి సాకుతో తొలగించడం దారుణమని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఎస్సీ మున్సిపల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్‌బాబు డిమాండ్ చేశారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఎమ్మెల్యేని కలిసి వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు తిరుపాలు, ఉపాధ్యక్షులు సురే్‌షబాబు, వెంకటప్ప, చిరంజీవి, ఓబుళేసు, రాఘవ, గంగాధర్, అంజి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య
Read Latest Telangana News and National News