Home » Twitter
UPSC Aspirant: తాజాగా, ఓ యువతి తన జీవితంలో చోటుచేసుకున్న ఓ చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ ‘ ఎగ్జామ్ వ్యక్తిని మార్చలేదు. అందరూ ఒకే జాతికి చెందిన వారు.. అలాంటప్పుడు వేరుగా ఎలా ఉంటారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పేద బిడ్డల విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరాని నేరమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడం శుభపరిణామమని, పార్లమెంటరీ విజయం కంటే ఎక్కువ ప్రతిబింబిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ బిల్లును లోక్‌సభలో దాదాపు 12 గంటలు, అలాగే రాజ్యసభలో దాదాపు 14 గంటలు పూర్తిగా చర్చలు జరిగాయని.. ఈ బిల్లుపై ఏకపక్ష నిర్ణయం కాకుండా ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి ఆందోళనను పరిష్కరించారని, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు.
Twitter bird logo: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను వేలం వేసింది. ఆక్షన్‌లో ఈ నీలి పక్షి ఎంత ధర పలికిందంటే..
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ 'పిట్ట' మనందరికీ తెలిసిందేకదా.. ఇప్పుడు సదరు పాత ట్విట్టర్ లోగో అయిన ఈ ఐకానిక్ బ్లూ బర్డ్ వేలం వేశారు. వేలంలో ఈ బుల్లి పిట్ట 35 వేల డాలర్లకు అమ్ముడుపోయింది. 'ఆర్‌ఆర్ ఆక్షన్' అనే సంస్థ నిర్వహించిన తాజా వేలంపాటలో ఈ ధర వచ్చింది.
ప్రముఖ కన్నడ హీరో ఉపేంద్ర నటించిన సూపర్ హిట్ సినిమా ఉపేంద్ర చూసే ఉంటారు. అందులో హీరో నేను ఫిల్టర్ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. ఇష్టం వచ్చినట్లు చేస్తుంటాడు. ఇప్పుడు గ్రోక్ కూడా అలాగే కనిపిస్తోంది.
సామాజిక మధ్యమం ఎక్స్ సేవలు సోమవారం పలుమార్లు స్తంభించాయి. భారత్తో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో ఎక్స్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
జమ్మూ కాశ్మీర్లో సోమవారం చోటు చేసుకున్న ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కు చెందిన వీర జవాన్ కార్తీక్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా, బంగారువాండ్లపల్లె మండలం, ఎగువ రాగి మానుపెంటకు చెందిన కార్తీక్ ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి వీరమరణం చెందారు.
ఒకే రోజు నలుగురు రైతులను పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిదని.. రైతు రాజ్యం కాదిది.. రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదని, తోడేళ్ళలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిదని అన్నారు.