Lokesh Reaction: ఆ పోస్ట్‌కు మంత్రి లోకేష్ క్విక్ రియాక్షన్.. వారికి సీరియస్ వార్నింగ్
ABN , Publish Date - Jun 24 , 2025 | 01:23 PM
Lokesh Reaction: ఓ సామాన్యుడు ఎక్స్‌లో చేసిన పోస్ట్‌కు మంత్రి నారా లోకేష్ స్పందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థుల ర్యాలీకి సంబంధించి శ్యామ్ అనే యువకుడు పోస్ట్ చేశారు.

అమరావతి, జూన్ 24: సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఎంతో చురుగ్గా ఉంటారు విద్యాశాఖా మంత్రి (Minister Nara lokesh) నారా లోకేష్. ఏపీ ప్రభుత్వ పాలనకు సంబంధించిన అనేక విషయాలను ఎక్స్ వేదికగా ప్రజలతో పంచుకుంటుంటారు. ఇప్పుడు తాజాగా ఓ సామాన్యుడు చేసిన పోస్ట్‌కు వెంటనే స్పందించారు మంత్రి. పార్వతీపురం జిల్లాలోని ఓ స్కూల్‌లో జరిగిన విషయాన్ని శ్యామ్ అనే వ్యక్తి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్ విద్యార్థులను రాజకీయ నిరసనకు తీసుకెళ్లారని.. తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారని మంత్రికి తెలిపారు శ్యామ్. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పోస్ట్‌పై వెంటనే స్పందించిన మంత్రి లోకేష్.. ఇది చాలా దారుణమన్నారు. పిల్లల భవిష్యత్‌తో ఎవరూ ఆడుకోవద్దని.. ఇలా చేసే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని కూడా మంత్రి లోకేష్ రీ పోస్ట్ చేశారు.
శ్యామ్ ట్వీట్ ఇదే..
‘గౌరవనీయులైన విద్యాశాఖా మంత్రి లోకేష్‌కు.. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్‌లో జరిగిన ఆందోళనకర సంఘటన గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిన్న స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారు. షాకింగ్‌గా.. ఎంఈవో, హెచ్‌ఎం ఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను అనుమతించారు. తిరిగి వస్తుండగా జరిగిన ఒక దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఎంఈవో, హెచ్‌ఎం బాధ్యతారహిత ప్రవర్తనపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థుల భద్రతను ఫణంగా పెట్టి, స్కూల్ సమయంలో రాజకీయ నిరసనకు అనుమతించడం చట్ట విరుద్ధం. ఈ సంఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులైన ఎంఈవో, హెచ్‌ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడే ఇటువంటి నిర్లక్ష్యాన్ని సహించలేం. త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ శ్యామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
వారి జోలికి పోవద్దు: లోకేష్
శ్యామ్ పోస్ట్‌పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ‘ఇది చాలా దారుణం, నేరం కూడా..! దీనిపై సత్వరమే విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నాను. గాయపడిన పిల్లలు, తల్లిదండ్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం. పాఠశాలల్లో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు, అధికారులకు హెచ్చరిక కావాలి. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తాం’ అంటూ మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు.
ఇవి కూడా చదవండి
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా.. జగన్‌పై షర్మిల ఫైర్
కేబినెట్ మీటింగ్‌కు వచ్చిన పవన్.. వెంటనే హైదరాబాద్‌కు పయనం
రియల్ మోసం.. వైసీపీ నేత కుమారుడి అరెస్ట్
Read Latest AP News And Telugu News