Share News

MP Kesineni Chinni: ఏడాది కాలంలో అనేక అభివృద్ధి పనులు..

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:40 AM

MP Kesineni Chinni: నేరాల నియంత్రణకు పోలీసులు సీసీ కెమెరాలను అస్త్రాలుగా వాడుతున్నారని, విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో అనేక కాలనీలు, అపార్ట్‌మెంట్‌లో వందలాది సీపీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.

MP Kesineni Chinni: ఏడాది కాలంలో అనేక అభివృద్ధి పనులు..
MP Kesineni Chinni

Amaravati: సుపరిపాలనలో తొలి అడుగు కింద ఏడాది కాలంలో విజయవాడ (Vijayawada) పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి పనులు (Development Works) చేపట్టామని, పార్లమెంట్ పరిధిలోని రైల్వేస్టేషన్‌లు (Railway stations) ఆధునీకరించటంతో పాటు రహదారులను అభివృద్ధి చేశామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (MP Kesineni Sivanath (Chinni)) అన్నారు. విజయవాడ ఆటోనగర్ రూపురేఖలు మార్చి లారీల ప్రవేశ అనుమతులు సులభతరం చేశామన్నారు. వచ్చే 40 ఏళ్లలో భక్తుల తాకిడి తట్టుకునేలా దుర్గగుడి వద్ద అభివృద్ధి పనులు చేపడుతున్నామని, కృష్ణ పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నామని కేశినేని చిన్ని చెప్పారు. కొండ ప్రాంతాల్లో నీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు.


నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు..

నేరాల నియంత్రణకు పోలీసులు సీసీ కెమెరాలను అస్త్రాలుగా వాడుతున్నారని, విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో అనేక కాలనీలు, అపార్ట్‌మెంట్‌లో వందలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని కేశినేని చిన్ని అన్నారు. పటమట పోలీస్టేషన్ పరిధిలో తొమ్మిది కాలనీల్లో నూతనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కెమెరాలను రిమోట్ ద్వారా ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రారంభించారు. అతిథులకు ఎసీపీ దామోదర్, పటమట సీఐ పవన్ కిషోర్ మొక్కలు ఇచ్చి సన్మానం చేశారు.


ఈ రోజు చాలా ఆనందంగా ఉంది..

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాధ్ మాట్లాడుతూ.. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి మంగళవారం నాటికి ఏడాది అయ్యిందని, ఈరోజు తొలి సమావేశం మంచి కార్యక్రమంలో‌ పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచనలు, సలహాలు తనకు ఎంతో పని చేశాయన్నారు. నన్ను ప్రోత్సహించిన సీఎం చంద్రబాబు, ‌మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరి, కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు విజయవాడ అభివృద్ధిలో కీలకంగా పని చేస్తున్నారని, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను తిరిగి అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. డ్రోన్‌ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకున్నారని అన్నారు. టెక్నాలాజీని అందిపుచ్చుకోవడంలో ఆయన ప్రతిభ అపారమని అన్నారు.

అన్ని పీఎస్‌లు ఇలాగే ఉండాలి..

వరదలు, దసరా ఉత్సవాల సమయంలో పోలీసుల పాత్ర కీలకమని, టెక్నాలజీ ద్వారా ఒక చోట కూర్చునే సమీక్ష చేస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా సీపీ‌ పని చేస్తున్నారని, మోడల్ పోలీస్టేషన్‌గా సత్యనారాయణపురం స్టేషన్ నిర్మాణం చేశారని, యన్టీఆర్‌ జిల్లా మొత్తం అన్ని పోలీస్టేషన్‌లు ఇలానే ఉండాలనేది తన కోరిక అని అన్నారు. ఈ విషయాన్ని హోం మంత్రి అనిత దృష్టికి తీసుకువెళతానని అన్నారు.


విజయవాడ వాసుల్లో ధాతృత్వం ఎక్కువ..

విజయవాడ వాసుల్లో ధాతృత్వం ఎక్కువని.. వరదల సమయంలో వారు చేసిన సేవలు అద్భుతమని ఎంపీ కేశినేని చిన్ని కొనియాడారు. దాతల సహకారంతో ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. సీపీ రాజశేఖర్ బాబు చొరవ, సిబ్బంది పని తీరు వల్ల యన్టీఆర్‌ జిల్లాలో నేరాలు తగ్గాయన్నారు. ఇదే విధంగా దాతల సహకారంతో మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇటువంటి అభివృద్ధిలో పోలీసులు మమ్ములను కూడా భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందని, పోలీసులు, ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా తమ వంతు సహకారం ఎప్పుడూ అందిస్తామని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టులో కొత్తకోణం

ఏపీలో ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపులకు అమోదం..!

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 24 , 2025 | 11:48 AM