Home » Pressmeet
ఒక్క భూమి ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి వచ్చిందని, ధరణి వచ్చిన తరువాత భూ సమస్యలు వచ్చాయని.. ఒకరి భూమి మరొకరికి వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎమ్మార్వో లు పరిష్కారం చేసే పరిస్థితి లేదని.. ఆధార్ లాగ భూధార్ వచ్చిందన్నారు. భూమి రికార్డులు వెరిఫై చేసి ఎలాంటి వివాదాలు లేకుండా హక్కులు కల్పిస్తామని చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆ పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం పేర్కొంది. దీనిపై స్పందించిన ఆయన ఏమన్నారంటే..
తెలుగు దేశం హయంలో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని... ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో పోలవరం విధ్వంసం జరిగిందని రామానాయుడు అన్నారు. జగన్ పోలవరం ప్రాజెక్టును రెండు ముక్కలుగా చేశారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1, 2 రెండుగా విభజించారని, పోలవరం నిర్వాసితులకూ అన్యాయం జరిగిందన్నారు.
పీఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వంలో ఏసీబీ డిజీగా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే కాకుండా, గతంలో తనతో విభేదాలున్న వ్యక్తులు, మహిళలను తన అధికారాన్ని ఉపయోగించి తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి వేధించారని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు.
సోనియా గాంధీ, రాహుల్ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చేర్చడంపై కాంగ్రెస్ రాద్దాంతం చేస్తోందని, ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ బెయిల్‌ప ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు.
క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పాస్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. వారికి ప్రతి నెల రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో 8 వేల మందికిపైగా పాస్టర్లకు లబ్ది చేకూరనుంది.
దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సయితం చంద్రబాబు అంటే అభివృద్ధి, నమ్మకానికి బ్రాండ్ అని చెబుతున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. భయం, అసూయతో జగన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, నమ్మకం, విశ్వాసం అని జగన్ చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు.
రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారని, హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని, రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్‌ను గుర్తుంచుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
బెల్టు షాపుల మీద ఉక్కు పాదం మోపుతున్నామని, బెల్టు షాపు అనుబంధంగా ఉన్న షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హత్యలు, అక్రమ కేసులతో రెచ్చిపోయారని, 44 రోజుల పాటు తాను కూడా రాజమండ్రి జైల్లో ఉన్నానని చెప్పారు.
తమది ఆస్తుల గొడవ కాదని.. స్టూడెంట్ విషయాల్లో ప్రారంభమైన గొడవ అని మంచు మనోజ్ తెలిపారు. తన ఇంట్లో జరిగిన బీభత్సంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మీరు ఇక్కడ ఉండడం లేదు కదా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు మూడు ఎఫ్ఐఆర్లు అయినా పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ ఒక్క ఛార్జ్ షాట్ కూడా ఫైల్ చేయలేదుని ఆరోపించారు.