Share News

Harish Rao: బీఆర్ఎస్ పథకాలను అటకెక్కించారు..

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:36 PM

Harish Rao: కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అయ్యాయని, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలు సీఎం రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని.. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు.

Harish Rao: బీఆర్ఎస్ పథకాలను అటకెక్కించారు..
Harish Rao

Hyderabad: బీఆర్ఎస్ సీనియర్ నేత (BRS Leader), మాజీ మంత్రి (Ex Minister) హరీష్ రావు (Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)పై సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X) వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ఆత్మశుద్ధిలేని యాచార మదియేల.. భాండశుద్ధి లేని పాకమేల..’ అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉందని అన్నారు. సన్నాలకు బోనస్ బంద్..ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్.. గ్యాస్ బండకు రాయితీ బంద్.. రాజీవ్ యువ వికాసం అమలు కాకముందే బంద్.. బీఆర్ఎస్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ మొత్తానికే ప్రభుత్వం బంద్ చేసిందని హరీష్ రావు ఆరోపించారు.


అన్ని పథకాలు బంద్ అయ్యాయి..

ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అయ్యాయని, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలు సీఎం రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని.. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. పాలన అంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు తీర్చుకోవడం కాదని.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభయ హస్తం మేనిఫెస్టోలో ఊదరగొట్టారని.. గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డిడి పైసలు కూడా వాపస్ ఇవ్వలేని దుస్థితి నెలకుందని తీవ్రస్థాయిలో విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని విని విసిగి పోయిన యాదవ, కురుమ సోదరులు గాంధీ భవన్‌కు గొర్రెలు తోలుకొని వచ్చి.. నిరసన తెలియచేసారని అన్నారు. మోసాన్ని గుర్తించి, అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్‌కు పోటెత్తకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలన్నారు. చెప్పిన గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు ఇకనైనా అమలు చేయకుంటే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని హరీష్ రావు అన్నారు.


పంచాయతీ నిధులు విడుదల చేయాలి..

కాగా మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు పెండింగ్‌ బిల్లుల చెల్లింపుతో పాటు పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్కకు ఆదివారం హరీశ్‌రావు లేఖ రాశారు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయి, పారిశుధ్యం పడకేసిందని తెలిపారు. చేసిన పనులకు బిల్లులు రాక మాజీ సర్పంచ్‌లు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఆ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 2019లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 9,350 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను నియమించిందని, వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించాలని, పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి:

వైసీపీ యువత పోరు అట్టర్ ప్లాప్..

సునీల్ కుమార్ ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు

జగన్‌ను నమ్మి.. నష్టపోయి.. వైసీపీ కార్యకర్త ఆత్మహత్య

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 23 , 2025 | 12:36 PM