Share News

Konakalla: కూటమి ప్రభుత్వానికి ఆపాదించడం సిగ్గుచేటు..

ABN , Publish Date - Jun 23 , 2025 | 10:26 AM

Konakalla fire on Jagan: గత ఐదేళ్లు అబద్దాలు ప్రచారం చేసినందుకే రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లకే పరిమితం చేసి బుద్ది చెప్పారని ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. అయినా ఇంకా అవే అబద్దాలతో ప్రజలను మాయ చేయాలని జగన్ యత్నిస్తున్నారని మండిపడ్డారు.

Konakalla: కూటమి ప్రభుత్వానికి ఆపాదించడం సిగ్గుచేటు..
Konakalla Narayana Rao

కృష్ణా జిల్లా: వైసీపీ కార్యకర్త (YCP Activist) నాగమల్లేశ్వరరావు (Nagamalleswararao) బెట్టింగ్‌ (Betting)లకు పాల్పడి అప్పులతో ఆత్మహత్య చేసుకున్నాడని, వైఎస్ జగన్ (YS Jagan) ఆనాడు వైనాట్ 175 అని పదే పదే చెప్పబట్టే నాగమల్లేశ్వరరావు పందాలు కాశాడని, జగన్‌ను నమ్మి నష్టపోయిన కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఏపీ ఆర్టీసీ చైర్మన్ (AP RTC Chairman) కొనకళ్ళ నారాయణరావు (Konakalla Narayana Rao) అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.. ఆనాడు జగన్ ప్రభుత్వం ఉండగా జరిగిన ఘటనను కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలని చూడటం సిగ్గుచేటని అన్నారు.


వైద్యం అందించే మానవత్వం కూడా లేదా..

గత ఐదేళ్లు అబద్ధాలు ప్రచారం చేసినందుకే రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని11 సీట్లకే పరిమితం చేసి బుద్ది చెప్పారని నారాయణరావు అన్నారు. అయినా ఇంకా అవే అబద్దాలతో ప్రజలను మాయ చేయాలని జగన్ యత్నిస్తున్నారని మండిపడ్డారు. నాగమల్లేశ్వరరావు చనిపోయిన ఏడాది తర్వాత రాజకీయం చేయడం కోసమే జగన్ అతని కుటుంబం వద్దకు వెళ్లారని విమర్శించారు. పరామర్శల పేరుతో జగన్ బలప్రదర్శన చేయబట్టే ఇద్దరు చనిపోయారని అన్నారు. జగన్‌పై ఉన్న అభిమానంతో వచ్చిన సింగయ్య జగన్ కారు కిందే పడి చనిపోయినా పట్టించుకోలేదని, కారు కింద పడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించే మానవత్వం కూడా లేదా జగన్ అంటూ నారాయణరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


వారి కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు..

ఒక పరామర్శ పేరుతో మరొకరి ప్రాణాలు తీసిన వ్యక్తి జగన్ అని, పోలీసులు పరిమిత సంఖ్యలో వెళ్లాలని చెప్పినా.. మందీ మార్భలంతో హడావుడి చేశారని నారాయణరావు విమర్శించారు. వైసీపీ నేతల నిర్లక్ష్యం కారణంగా మరొక వ్యక్తి వడదెబ్బతో చనిపోయాడని, జగన్ పర్యటన కోసం వచ్చిన ఇద్దరు చనిపోతే వారి కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు. సింగయ్య జగన్ కారు కిందే పడి చనిపోయినట్లు వీడియోలు స్పష్టంగా వచ్చాయని, ఇది కూడా మార్ఫింగ్ అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. జగన్‌కు మానవత్వం ఉంటే.. ముందు సింగయ్య కుటుంబాన్ని పరామర్శించాలని అన్నారు.


జగన్‌వి హత్య రాజకీయాలు..

వైనాట్ 175 అని జగన్ చెప్పిన మాటలు నమ్మి వేలాది మంది అప్పుల పాలై ఆస్తులు అమ్ముకున్నారని నాగమల్లేశ్వరరావు కూడా క్రికెట్ బెట్టింగ్ తరహాలో.. ఎన్నికలలో విజయం మీద బెట్టింగ్‌లు కాయడానికి జగన్ మాటలే కారణమని నారాయణరావు అన్నారు. నాగమల్లేశ్వరరావు, సింగయ్య, మరో వ్యక్తి చనిపోవడానికి కారణం జగనేనని, హత్యా రాజకీయాలు చేయడం జగన్‌కు అలవాటని అన్నారు. ప్రజలు బుద్ది చెప్పినా.. ఇంకా జగన్‌కు గుణపాఠం రాలేదని, జగన్ చేసిన దుర్మార్గాలు చాలా ఉన్నాయని అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేశారని, గత ఐదేళ్లల్లో అరాచక పాలనతో.. అక్రమంగా కేసులు పెట్టించారని, ఇప్పుడు పరామర్శల పేరుతో బలప్రదర్శన చేస్తూ.. నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ తీరు మార్చుకుని.. బుద్ది తెచ్చుకోవాలని.. కుట్రలు మానుకోవాలని కొనకళ్ళ నారాయణరావు సూచించారు.


ఇవి కూడా చదవండి:

శాయ్ క్రీడా సంస్థ కోచ్‌పై పోక్సో కేసు

సింగయ్య మరణాన్ని కప్పిపుచ్చేందుకు మరో డ్రామా

వైసీపీ కార్యకర్తలపై జగన్ కామెంట్ల ప్రభావం

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 23 , 2025 | 10:36 AM