Share News

Pawan Kalyan: ఎమర్జెన్సీ అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటి..

ABN , Publish Date - Jun 25 , 2025 | 10:49 AM

Pawan Kalyan: రాజ్యాంగ ద్రోహానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా నిలబడదామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మన ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టిన వారి త్యాగాలను గుర్తుచేసుకోవడానికి సంవిధాన్ హత్య దివస్‌ను పాటిస్తామని అన్నారు.

Pawan Kalyan: ఎమర్జెన్సీ అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటి..
AP Deputy CM Pawan Kalyan

Amaravati: ‘ఎమర్జెన్సీ’ (Emergency) 25-06-1975 స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాలలో (Dark Chapter) ఒకటని.. ఇది కేవలం ఒక రాజకీయ సంఘటన కాదు.. ఇది రాజ్యాంగానికి ప్రత్యక్ష ద్రోహమని ఏపీ ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం.. అప్పటి కాంగ్రెస్ (Congress) నాయకత్వ అధికార దాహానికి చిహ్నమని అన్నారు. పత్రికలను అణచివేశారని, ప్రతిపక్షాల గొంతు నొక్కివేశారని, ప్రాథమిక హక్కులను నిలిపివేశారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.


రాజ్యాంగ ద్రోహానికి 50 ఏళ్లు..

లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కె.అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్, మొరార్జీ దేశాయ్ వంటి గొప్ప నాయకులు అనేక మంది ప్రజాస్వామ్య రక్షణ కోసం నిలబడి జైలు పాలయ్యారని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రాజ్యాంగ ద్రోహానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా నిలబడి మన ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టిన వారి త్యాగాలను గుర్తుచేసుకోవడానికి ‘సంవిధాన్ హత్య దివస్’ను పాటిస్తామని అన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా నిలబడిన నాయకుడు చేసిన త్యాగాలను, వారి గొంతులను అణచివేసిన లక్షలాది మంది వేదనను గుర్తుచేసుకుందామన్నారు. నేటికీ, రాజకీయాల పేరుతో మన రాజ్యాంగాన్ని రాజీ చేసే ఏ ప్రయత్నానికైనా దూరంగా ఉండాలని పవన్ కల్యాణ్ అన్నారు.


ఇవి కూడా చదవండి:

నిరంకుశత్వం రాజ్యమేలిన వేళ..

స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు..

సర్వేయర్ హత్య కేసు.. ఇంకా చిక్కని ప్రధాన నిందితుడు..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 25 , 2025 | 02:16 PM