Minister Gottipati: సింగయ్యను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళితే బతికేవాడు..
ABN , Publish Date - Jun 22 , 2025 | 01:59 PM
Minister Gottipati: పబ్లిసిటీ స్టంట్ కోసం ప్రజల ప్రాణాలను జగన్ గాల్లో కలుపుతున్నారని పల్నాడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ కాన్వాయ్ కిందపడి ఆ పార్టీ కార్యకర్త సింగయ్య మరణించాడని, కారు ఢీ కొన్న వెంటనే గాయపడిన అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించి ఉంటే బతికేవాడని మంత్రి అన్నారు.

Amaravati: వైసీపీ అధ్యక్షుడు (YCP Chief), మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Ex CM Jagan) తన పబ్లిసిటీ స్టoట్‌ల (Publicity Campaign) కోసం ప్రజల ప్రాణాలు గాల్లో కలుపుతున్నారని, ప్రజల్లో తనకు ఆదరణ ఉందని చూపించుకోవటం కోసం అమాయక ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటంలేదని పల్నాడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati Ravi Kumar) తీవ్ర స్థాయిలో విమర్శించారు (Comments). ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలుగా తాము రోజూ ఎంతో మందిని పరామర్శిస్తుంటామని.. జగన్‌లా ఎవ్వరూ ప్రచారం కోరుకోవట్లేదని అన్నారు.
కనీసం పశ్చాత్తాపం కూడా లేదు..
పార్టీకి ఇంకా బలం ఉందని చూపించుకునే ప్రయత్నంలో ప్రజల ప్రాణాలు కూడా లెక్క చేయరా.. జగన్ అంటూ మంత్రి గొట్టిపాటి ప్రశ్నించారు. బెట్టింగ్ అడి.. డబ్బులు పోగొట్టుకుని చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లి మరో రెండు నిండు ప్రాణాలు బలితీసుకున్నారని మండిపడ్డారు. జగన్ కాన్వాయ్ ఢీ కొన్న వెంటనే సింగయ్యను ఆసుపత్రికి తరలించి ఉంటే అతని ప్రాణం నిలబడేదని అన్నారు. రోడ్డు పక్కన వెళ్తూ ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోతేనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలిస్తుంటామని.. అలాంటిది సొంత పార్టీ కార్యకర్త సింగయ్యను కారుతో ఢీ కొట్టటమే కాకుండా రోడ్డు పక్కకు ఈడ్చేసి వెళ్లిపోవడం మానవత్వం లేకపోవటమేనని మంత్రి విమర్శించారు. చేసిన పనికి కనీసం పశ్చాత్తాపం కూడా లేదని మండిపడ్డారు. పోలీసులు శాంతి భద్రతల సమస్య అని ముందే చెప్పినా, మాజీ మంత్రులు పోలీసులతో గొడవలకు దిగటం ఎంత వరకు సమంజసమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు.
జగన్ రాజకీయాలకు అనర్హుడు..
సింగయ్య మృతికి జగనే పూర్తి బాధ్యత వహించాలని మంత్రి గొట్టిపాటి డిమాండ్ చేశారు. ఆయన కాన్వాయ్‌లోని వాహనం ఢీ కొని సింగయ్య తీవ్ర గాయాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా వైసీపీ నేతలెవ్వరూ ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా రోడ్డు పక్కనే వదిలేశారని, వారంతా మానవత్వం మరచిపోయారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఖాళీ అవుతున్న వైసీపీని కాపాడుకోడానికే జగన్ డ్రామాలాడుతున్నారని, ఆయన చేస్తున్నవన్నీ మోసపూరిత పరామర్శలు, వాగ్దానాలేనని, ఆ పార్టీనే ఒక మోసపూరిత పార్టీ అని అన్నారు. జగన్ రాజకీయాల్లో కొనసాగేందుకు అనర్హుడని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
గంజాయి తనిఖీలకు వెళ్లి.. కానిస్టేబుల్ మృతి
డిప్యూటీ సీఎంపై అనుచిత పోస్టులు..
విశాఖ యోగాకు గిన్నిస్ బుక్‌లో స్థానం
For More AP News and Telugu News