Home » Kesineni Chinni
MP Kesineni Chinni: నేరాల నియంత్రణకు పోలీసులు సీసీ కెమెరాలను అస్త్రాలుగా వాడుతున్నారని, విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో అనేక కాలనీలు, అపార్ట్‌మెంట్‌లో వందలాది సీపీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు.
Minister Gummidi Sandhyarani: మినీ అంగన్‌వాడీలను పూర్తి స్థాయి అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదన చేశామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పిల్లల ఆరోగ్యమే ధ్యేయంగా పౌష్టికాహారం, రోజూ గుడ్డు, పాలు అందిస్తున్నామని అన్నారు. పాలు ఇరిగిపోతున్నాయన్న ఫిర్యాదులపై పాల పౌడర్లు అందించడం ప్రారంభించామని మంత్రి తెలిపారు.
MP Kesineni Sivanath: మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.జగన్ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని లేకపోతే చూస్తూ ఊరుకోమని ఎంపీ కేశినేని శివనాథ్ హెచ్చరించారు.
Kolikapudi Srinivas: కేశినేని నానిపై తెలుగుదేశం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లు రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. రెండుసార్లు టికెట్ ఇచ్చినా కేశినేని నాని టీడీపీకి వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మండిపడ్డారు.
Kesineni Sivanath: మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను ఎదుర్కొనే దమ్ము నానికి లేదని విమర్శించారు. తన జోలికి వస్తే చూస్తూ ఊరుకోనని కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Buddha Venkanna: గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహరంలో వైఎస్ జగన్‌ను తప్పించే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈ కుంభకోణంతో వైఎస్ జగన్‌కు సంబంధం లేదంటే పదేళ్ల పిల్లోడు సైతం నమ్మడని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
Kesineni Chinni: మాజీ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబంలో ఐదు, ఆరు కంపెనీలు ఉన్నాయని తెలిపారు. అన్నీ లీగల్‌గానే ఉన్నాయని స్పష్టం చేశారు. విజయవాడ పాలేరుకు చాలా కంపెనీలు ఉన్నాయని, వాటి నిగ్గు కూడా తేల్చాలని కేశినాని నానిపై కేశినేని శివనాథ్ ఆరోపణలు చేశారు.
MP Kesineni Chinni: ఏపీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫించన్లు పంపిణీ చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అర్హులందరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వంలో పేదల సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
MP Kesineni Shivnath: ఏపీ భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతామని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు, ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధివిధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు.