Share News

MP Sivanath: ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: ఎంపీ శివ‌నాథ్

ABN , Publish Date - Nov 09 , 2025 | 02:22 PM

ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఆదివారం విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ శివనాథ్ పాల్గొన్నారు.

MP Sivanath: ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: ఎంపీ శివ‌నాథ్
MP Keshineni Sivanath

విజయవాడ, నవంబరు9 (ఆంధ్రజ్యోతి): గొల్ల‌పూడి మార్కెట్ యార్డ్ అభివృద్ధికి (Gollapudi Market Yard Development) కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) (MP Keshineni Sivanath) అన్నారు. ఇవాళ (ఆదివారం) గొల్ల‌పూడి వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డ్‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, వెంక‌ట వ‌సంత కృష్ణప్ర‌సాద్ సంద‌ర్శించారు.


పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. గొల్ల‌పూడి మార్కెట్ యార్డులో రైతు కొనుగోలు సేవా కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు. గొల్ల‌పూడి మార్కెట్ యార్డులో రూ.1.50 ల‌క్ష‌ల‌తో అంత‌ర్గ‌త రోడ్ల‌ నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ చేశామన్నారు. సీఎం చంద్ర‌బాబు గొల్ల‌పూడి యార్డులో వివిధ ప‌నుల‌కు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. మార్కెట్ యార్డుకి శాశ్వ‌త ఆదాయాన్ని తీసుకువ‌చ్చే 90 దుకాణాల నిర్మాణ పనులు 85 శాతం పూర్తి అయ్యాయని ఎంపీ చిన్నివెల్లడించారు.


ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం రైతు బంధు ప్ర‌భుత్వం: ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్

గొల్ల‌పూడిలో రైతు బ‌జార్ నిర్మాణం చివ‌ర ద‌శ‌లో ఉందని ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ అన్నారు. ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం రైతుబంధు ప్ర‌భుత్వమని ఉద్ఘాటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తోందని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 09 , 2025 | 02:57 PM