Share News

Serial bride case: నేను నిత్య పెళ్లికూతురిని కాదు..

ABN , Publish Date - Jun 24 , 2025 | 12:57 PM

Serial bride case: నిత్య పెళ్లికూతురు వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. రివర్స్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మోసం చేసానంటున్న 12 మందిని తీసుకువచ్చి నిజ‌నిజాలు తేల్చాలంటూ సవాల్ చేసింది.

Serial bride case: నేను నిత్య పెళ్లికూతురిని కాదు..
Serial Bride Woman Case

Konaseema Dist: నిత్య పెళ్లికూతురు (Serial Bride) వ్యవహారంలో ట్విస్ట్ (Twist) నెలకొంది. ఆమె రివర్స్‌లో పోలీసులకు ఫిర్యాదు (Police complaint) చేసింది. తనపై కొందరు తప్పుడు ఆరోపణలు (False Allegations) చేస్తున్నారంటూ రామచంద్రపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు ఆరోపణలు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తాను నిత్య పెళ్లికూతురుని కాదని (I Am Not a Serial Bride Woman) వివరణ ఇచ్చింది. తాను మోసం చేశానంటున్న 12 మందిని తీసుకువచ్చి నిజ‌నిజాలు తేల్చండి అంటూ సవాల్ చేసింది. న్యాయం కోసం తాను చాలా మంది రాజకీయ నాయకుల‌కు పిర్యాదు చేసినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.


వివరాల్లోకి వెళితే..

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వారే ఆమె లక్ష్యం. ఇలా రెండేళ్లలో ఏకంగా డజను పెళ్లిళ్లు చేసుకుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నిత్య పెళ్లికూతురి బాగోతంపై పలువురు బాధితులు అమలాపురంలోని జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.


భర్త ఎదురు తిరిగితే కేసులంటూ బెదిరింపు..

కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్న యువతి, మరో ముగ్గురు సభ్యులతో కలిసి ముఠాగా ఏర్పడింది. రెండేళ్లలో 12 మందిని పెళ్లి చేసుకుంది. వారి టార్గెట్‌ ఒక్కటే.. డబ్బు. ముందుగా... భార్యతో విభేదాలు వచ్చి కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నవారు, పెళ్లికాని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ధనవంతులను టార్గెట్‌ చేసుకుంటారు. భార్యకు దూరంగా ఉండే భర్తలతో ఆమె పరిచయం చేసుకుని సన్నిహితంగా ఉంటుంది. తనను పెళ్లి చేసుకునే వరకు కథ నడుపుతుంది. ఆమె కుటుంబ సభ్యులుగా.. మరో ముగ్గురు సహకరించేవారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె అత్తవారి ఇంటికి వెళ్లేది కాదు. భర్త ఎదురుతిరిగితే కేసులు పెడతామని బెదిరించేది. రహస్య పెళ్లి, కాపురానికి సంబంధించిన ఫొటోలు దగ్గర పెట్టుకుని, వాటినే చూపిస్తూ ఎందరినో బ్లాక్‌మెయిల్‌ చేసి రూ. లక్షల్లో దోచుకునేవారు. ఇలా రెండేళ్ల కాలంలో 12 మందిని పెళ్లి చేసుకుని వారి కుటుంబాల నుంచి రూ. కోట్లలో ఆస్తులు, డబ్బులు కాజేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

యువతి వల్ల మోసపోయిన కుటుంబాల వారంతా ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని కొవ్వూరు, నర్సాపురం ప్రాంతాలకు చెందిన బాధితులు. వారంతా అమలాపురం ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్సులో ఫిర్యాదులు అందజేశారు.


ఇవి కూడా చదవండి:

భక్తుల కోసం టీటీడీ మరో అడుగు ముందుకు..

ఏడాది కాలంలో అనేక అభివృద్ధి పనులు..: కేశినేని చిన్ని

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 24 , 2025 | 01:02 PM