Anand Mahindra: ఈ నిశ్శబ్ధ యోధుడికి వందనాలు
ABN , Publish Date - Jul 22 , 2025 | 06:41 PM
ఆనంద్ మహీంద్రా 'ఎక్స్'లో తాజాగా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. ఒక పెద్దాయన రిక్షాతో రోడ్లపై చెత్త సేకరిస్తున్న వీడియో పెట్టి.. ఈ వీధుల యోధుడికి వందనాలన్నారు. ఇంతకీ.. ఎవరైనా సరే సలాం పెట్టాల్సిన..

ఇంటర్నెట్ డెస్క్: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్'లో తాజాగా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. ఒక పెద్దాయన రిక్షాతో రోడ్లపై చెత్త సేకరిస్తున్న వీడియో పోస్ట్ చేశారు. అయితే, ఆ పెద్దాయన వివరాలు చూసిన తర్వాత మాత్రం ఎవరైనా ఒక్కసారిగా ఆలోచనలో పడాల్సిన పరిస్థితి.
రోడ్లపై చెత్త సేకరిస్తున్న సదరు వ్యక్తి పేరు ఇందర్ జిత్ సింగ్ సిద్ధూ. వయసెంతో తెలుసా.. 88 సంవత్సరాలు. ఆయనొక రిటైర్డ్ పోలీస్ అధికారి. చాలా కాలంగా ఆయన నిత్యకృత్యం ఏంటంటే.. ప్రతీ రోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఆ రిక్షా బండితో రోడ్లపై ఉన్న చెత్త సేకరించి, కాలనీని పరిశుభ్రంగా ఉంచడం. చండీగఢ్ సెక్టార్ 49 లోని వీధుల్లో ఆయన నిత్యం ఈ పని చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇంతకీ ఆ పెద్దాయన ఆ బాధ్యతను ఎందుకు తీసుకున్నారో తెలిస్తే మరింత ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. స్వచ్ఛ సురేక్షణ్ జాబితాలో నగర పరిశుభ్రతకు గాను చండీగఢ్ కి తక్కువ ర్యాంకు రావడంతో ఆయన ఈ పనికి పూనుకున్నారు. ఎవరెవరి మీదో ఫిర్యాదులు చేయడమెందుకని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో తన వంతు కృషి చేస్తున్నారు.
పలువురు వేసే చెత్తను వయస్సుతో సంబంధం లేకుండా తొలగించడం అనేది వెలకట్టలేని పని. ఈ ఏఐ యుగంలో పరుగు.. పరుగుల జీవితాలకు ఇందర్ జిత్ సింగ్ వంటి వాళ్ల అడుగుజాడలు దేశ ప్రగతికి ప్రశాంతమైన మార్గాలే కదా.. ఈ వీధుల యోధుడికి ఎవరైనా సలాం పెట్టాల్సిందే.
Also Read:
తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు.. వైసీపీకి పవన్
దాడి చేస్తే భాష వచ్చేస్తుందా..
ఎన్ని ఇబ్బందులో: డిప్యూటీ సీఎం పవన్
For More Telangana News and Telugu News..