Share News

Reuters X Account: రాయిటర్స్ ఎక్స్ అకౌంట్‌ నిలుపుదల.. స్పందించిన భారత్..

ABN , Publish Date - Jul 06 , 2025 | 02:03 PM

Reuters X Account: భారత్ బ్లాక్ చేయమని చెప్పిన సోషల్ మీడియా అకౌంట్లలో రాయిటర్స్ ఎక్స్ అకౌంట్ కూడా ఉంది. అయితే, ఆ సమయంలో రాయిటర్స్ అకౌంట్‌ను ఎక్స్ బ్లాక్ చేయలేదు.

Reuters X Account: రాయిటర్స్ ఎక్స్ అకౌంట్‌ నిలుపుదల.. స్పందించిన భారత్..
Reuters X Account

ఇండియాలో రాయిటర్స్ ఎక్స్ అకౌంట్ నిలిచిపోవటంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రాయిటర్స్ ఎక్స్ ఖాతా ఇండియాలో ఓపెన్ అవ్వకపోవటంలో తమ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది. ఆ అవసరం కూడా తమకు లేదని తేల్చి చెప్పింది. గత కొద్దిరోజులనుంచి రాయిటర్స్ ఎక్స్ అకౌంట్ ఇండియాలో ఓపెన్ అవ్వటం లేదు. ఇండియాలో రాయిటర్స్ అకౌంట్‌ను ఓపెన్ చేసిన వారికి.. ‘న్యాయపరమైన డిమాండ్ కారణంగా అకౌంట్ నిలిపివేయటం జరిగింది’ అని చూపిస్తోంది.


రాయిటర్స్ ఎక్స్ అకౌంట్ ఇండియాలో ఓపెన్ అవ్వకపోవటంపై కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాయిటర్స్ ఎక్స్ అకౌంట్‌ను నిలిపివేయాల్సిన అవసరం భారత ప్రభుత్వానికి లేదు. ఎక్స్ ప్రతినిధులతో కలిసి ఆ సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము’ అని స్పష్టం చేశారు. అయితే, పీటీఐకి అందిన సమాచారం ప్రకారం.. ఆపరేషన్ సిందూర్ సమయంలో కేంద్ర ప్రభుత్వం పలు సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయమని ఎక్స్‌కు విన్నవించింది.


భారత్ బ్లాక్ చేయమని చెప్పిన సోషల్ మీడియా అకౌంట్లలో రాయిటర్స్ ఎక్స్ అకౌంట్ కూడా ఉంది. అయితే, ఆ సమయంలో రాయిటర్స్ అకౌంట్‌ను ఎక్స్ బ్లాక్ చేయలేదు. రాయిటర్స్ తప్ప భారత్ చెప్పిన మిగిలిన అన్ని అకౌంట్లు బ్లాక్ అయ్యాయి. ఆపరేషన్ సిందూర్ నాటి భారత్ విజ్ణప్తిపై ఎక్స్ ఇప్పుడు స్పందించి ఉంటుందని, రాయిటర్స్ ఎక్స్ ఖాతాను ఆలస్యంగా బ్లాక్ చేసి ఉంటుందని సమాచారం. రాయిటర్స్ అకౌంట్ వీలైనంత తర్వగా ఇండియాలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

ఆ తప్పుతో కుటుంబం మొత్తం గల్లంతు.. పాప మాత్రం..

సోషల్‌ మీడియా కేసులు.. ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు

Updated Date - Jul 06 , 2025 | 03:25 PM