Megastar Chiranjeevi: 'X'లో వల్గర్ కామెంట్స్.. పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు..
ABN , Publish Date - Oct 29 , 2025 | 10:20 AM
సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినా.. ఇంకా తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని చిరంజీవి మండిపడ్డారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో మరో ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా తనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తనపై అభ్యంతకర పోస్టులు పెట్టి తిడుతున్న కొన్ని X హ్యాండిల్ ప్రొఫైల్స్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినా.. తనపై ఇంకా వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు ఫిర్యాదులో దయా చౌదరి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై కూడా తగు చర్యలని తీసుకోవాలని అన్నారు. చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
కొన్ని రోజుల క్రితమే.. తన ఫోటోలను డీప్‌ఫేక్ చేస్తున్నారని చిరంజీవి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో దుండగులు పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే సీపీ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టను సైతం ఆశ్రయించటంతో న్యాయస్థానం ఆదేశాలతో సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన పేరును దెబ్బతీసేలా డీప్‌ఫేక్ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గతంలో కూడా మెగాస్టార్ చిరంజీవి సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి..
United Aircraft Corporation: భారత్‌లో పౌర విమానాల తయారీ
Lufthansa Flight Incident: లుఫ్తాన్సా విమానంలో ఘర్షణ