Elon Musk's Twitter Down: దేశవ్యాప్తంగా ట్విట్టర్ సర్వర్ డౌన్.. ఏమైందంటే?
ABN , Publish Date - Nov 18 , 2025 | 06:46 PM
ఎలాన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ సర్వర్ డౌన్ అయ్యింది. హఠాత్తుగా ఆగిపోవడంతో టెక్ ప్రపంచంలో గందరగోళం ఏర్పడింది.
ప్రపంచవ్యాప్తంగా మంగళవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) నుంచి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ X(గతంలో ట్విట్టర్) సర్వర్ లో సమస్య తలెత్తింది. వందలాది మంది యూజర్లు ఈ ప్లాట్‌ఫామ్‌కు యాక్సెస్ చేసుకోలేకపోవడంతో సోషల్ మీడియా సేవలు పూర్తిగా ఆగిపోయాయి. వెబ్ వెర్షన్ (x.com) , Android/iOS యాప్‌లు రెండూ ప్రభావితమయ్యాయని పేర్కొంటూ చాలా మంది డౌన్‌డెటెక్టర్‌లో ఈ సమస్యను ఫ్లాగ్ చేశారు. డౌన్‌డెటెక్టర్ వంటి ట్రాకింగ్ వెబ్‌సైట్ల ప్రకారం.. మంగళవారం ఉదయం 9:00 గంటల నుంచి ఈ ఆటంకం కొనసాగుతోంది. దీంతో మిలియన్ల మంది యూజర్లు ప్రభావితమయ్యారు.
'X'ని యాక్సెస్ చేయలేని వినియోగదారుల నుంచి 10,000 కంటే ఎక్కువ ఫిర్యాదులను డౌన్‌డెటెక్టర్ నమోదు చేసింది. చాలా ఫిర్యాదులు మొబైల్ యాప్ (61%) నుంచి వచ్చాయి. ఆ తర్వాత వెబ్‌సైట్ (28%), సర్వర్ కనెక్షన్ సమస్యలు (11%) ఉన్నాయి. ఈ అంతరాయం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను ప్రభావితం చేసినట్లు సమాచారం. ఈ ఆటకంతో X (ట్విట్టర్) యూజర్లు ట్వీట్లు చేయలేకపోయారు, చూడలేకపోయారు. ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ సేవలు, లెటర్‌బాక్స్‌డ్ వంటివీ డౌన్ అయ్యాయి. భారత్, అమెరికా, యూరప్‌లోని వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమయ్యారు.
డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. Xకు 18,000కు పైగా కంప్లైంట్లు, AWSకు 32,000కు పైగా రిపోర్టులు వచ్చాయి. తర్వాత చాలాచోట్ల సమస్యను పరిష్కరించారు. క్లౌడ్‌ఫ్లేర్ 'మెష్ లేయర్'లోని రూటింగ్ చేంజ్ కారణంగా ఈ సమస్య వచ్చినట్టు టెక్ నిపుణులు అనుమానిస్తున్నారు. 'వివిధ కస్టమర్లపై ప్రభావం చూపిన ఈ సమస్యను గుర్తించాం. పరిష్కరిస్తున్నాం' అని క్లౌడ్‌ఫ్లేర్ స్టేటస్ లో ప్రకటించింది. ధర్డ్ పార్టీ ప్రొవైడర్‌తో కలిసి పరిష్కారం కోసం పని చేస్తున్నట్టు తెలిపారు. డౌన్‌డెటెక్టర్ పెద్దఎత్తున యూజర్లు రిపోర్ట్ చేశారు. ఈ సమస్యకు AWS నేరుగా కారణం కాకపోయినా, AWS సేవలు క్లౌడ్‌ఫ్లేర్‌పై ఆధారపడటంతో కొంత ప్రభావం చూపినట్లుగా టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అంతా డీజీపీ పర్యవేక్షణలోనే..మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే
Read Latest AP News And Telugu News