AP CM Schedule: సీఎం చంద్రబాబు కడప షెడ్యూల్ ఫిక్స్.. నేడు పుట్టపర్తిలో బస..
ABN , Publish Date - Nov 18 , 2025 | 06:29 PM
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నాటి కడప పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పెండ్లిమర్రిలో నిర్వహించే 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ ఈ సాయంత్రానికే శ్రీ సత్యసాయి జిల్లాకు చేరుకున్నారు సీఎం.
కడప, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ ఆయన కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రికి వెళ్లనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం.. మధ్యాహ్నం 1 గంటకు హెలికాఫ్టర్ ద్వారా పెండ్లిమర్రికి చేరుకోనున్న ముఖ్యమంత్రి.. వెల్లటూరులోని మన గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1:40 గంటలకు పెండ్లిమర్రిలో ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4:20 గంటలకు చిన్నదొరసారిపల్లెలో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. 5:15 గంటలకు వెల్లటూరులో పార్టీ సభ్యులతో సమావేశం నిర్వహించి.. పలు అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కార్యక్రమం ముగిశాక సాయంత్రం 6:40 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడకు తిరుగు పయనం కానున్నారు.
బుధవారం షెడ్యూల్ నిర్వహణలో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లు.. మంగళవారం సాయంత్రం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి ప్రజాప్రతినిధులు, నాయకులు, టీడీపీ కార్యకర్తలు వారికి ఘనస్వాగతం పలికారు. ఈ రాత్రికి వారివురూ పుట్టపర్తిలోనే బస చేయనున్నట్టు సమాచారం. ఈనెల 19న.. శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో చంద్రబాబు, లోకేశ్‌లు పాల్గొననున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు కడప పర్యటన చేపట్టనున్నారు.
బిహార్ సీఎంగా నితీశ్ కుమార్.. ఈనెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. పాట్నాలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు సహా మంత్రి నారా లోకేశ్‌లు హాజరుకానున్నారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం.. ఎన్డీయే తరఫున ఏపీ విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ప్రచారం నిర్వహించారు.
ఇవీ చదవండి:
అంతా డీజీపీ పర్యవేక్షణలోనే..మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే