Share News

Team India Squad Update: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడే భారత జట్టు ఇదే!

ABN , Publish Date - Nov 18 , 2025 | 06:09 PM

సౌతాఫ్రికా సిరీస్‌ ఆడే భారత జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంట్రీపై సందేహాలు నెలకొన్నాయి.

Team India Squad Update: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడే భారత జట్టు ఇదే!
Team India Squad

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లతో కూడిన హై-వోల్టేజ్ వైట్ బాల్ సిరీస్ కోసం భారత్(India vs South Africa Series 2025) సిద్ధంగా ఉంది. జట్టు ప్రకటన కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వన్డే సిరీస్  2025 నవంబర్ 30న రాంచీలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో, డిసెంబర్ 6న విశాఖపట్నంలో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. డిసెంబర్ 9న కటక్‌లో తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 11న న్యూ చండీగఢ్ (ముల్లన్‌పూర్), డిసెంబర్ 14న ధర్మశాల, డిసెంబర్ 17న లక్నో రెండు, మూడు, నాలుగో టీ 20 మ్యాచులు జరుగుతాయి, డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగే చివరి టీ20తో సిరీస్ ముగియనుంది.


సౌతాఫ్రికా సిరీస్‌ ఆడే భారత జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో(Kohli Rohit Comeback) రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ స్టార్ ప్లేయర్లు ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కు తిరిగి వచ్చి పెద్ద ప్రభావాన్ని చూపారు. రోహిత్ శర్మ ఒక అర్ధ సెంచరీ, ఒక సెంచరీ సాధించగా... చివరి మ్యాచ్‌లో కోహ్లీ(78*) కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక త్వరలో జరిగే ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికాపై కోహ్లీ, రోహిత్ బాగా రాణించాలి. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగడంపై సందేహాలు నెలకొన్నాయి. ఆసియా కప్ సందర్భంగా గాయపడిన హార్దిక్ పాండ్యా.. ఆస్ట్రేలియా టూర్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.


గాయం నుంచి పూర్తిగా కోలుకున్న హార్దిక్ పాండ్యా(Hardik Pandya Injury).. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ సాధించేందుకు కష్టపడుతున్నాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే ముందు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హార్దిక్ తన ఫామ్ ను నిరూపించుకోనున్నాడు. నవంబర్ 26న జరిగే తొలి మ్యాచ్‌ లేదా నవంబర్ 28న జరిగే రెండవ మ్యాచ్‌లో బరోడా తరఫున బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ మినహా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత వన్డే జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదని సమాచారం.


వన్డే సిరీస్ ఆడే భారత జట్టు(అంచనా):

శుభ్‌మన్ గిల్/యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే/నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, నితీష్ రాణా/ప్రసిధ్ కృష్ణ.



ఇవి కూడా చదవండి:

IND VS BAN Women’s Series: భారత్‌-బంగ్లాదేశ్‌ సిరీస్‌‌పై కీలక అప్ డేట్

NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2025 | 06:10 PM