Aakash Chopra: గిల్ స్థానంలో ఆ స్టార్ ప్లేయర్‌ను తీసుకోండి: ఆకాశ్ చోప్రా
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:22 PM
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill Injury) గాయపడిన సంగతి తెలిసిందే. తదుపరి మ్యాచ్ ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మెడనొప్పి కారణంగా అతడు ఆస్పత్రిలో ఉండగా.. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నిద్రలేమి కారణంగానే గిల్ మెడ నరాలు పట్టేశాయని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. మెడనొప్పితోనే తొలి టెస్టులో బ్యాటింగ్‌కు దిగడంతో నొప్పి తీవ్రమైంది. 24 గంటల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే రెండో టెస్టులో అతని స్థానంలో బరిలోకి దిగే ఆటగాడు? ఎవరా? అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. శుభ్ మన్ గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad)ను జట్టులోకి తీసుకోవాలని భారత్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు.
'శుభ్‌మన్ గిల్ రెండో టెస్ట్( India vs South Africa 2ndTest) ఆడుతాడా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ గిల్ మ్యాచ్ కు దూరమైతే.. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ఆడించాలి. గిల్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ జట్టులో సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరూ లెఫ్టార్మ్ బ్యాటర్లు. ఇప్పటికే తుది జట్టులో ఆరుగురు ఎడమ చేతి బ్యాటర్లు ఉన్నారు. వీరిద్దరిలో ఎవరిని తీసుకున్నా.. ఏడుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లువుతారు. ఇది ఏ మాత్రం మంచిది కాదని నా అభిప్రాయం. అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్‌ల రూపంలో ప్రత్యామ్నాయం ఉన్నా.. రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ మ్యాచుల్లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
రుతురాజ్ గైక్వాడ్ భారత్ ఏ తరఫున వన్డేల్లో పరుగులు రాబడుతున్నాడు. రంజీ, దులీప్ ట్రోఫీలో గైక్వా్డ్ అద్భుతంగా రాణించాడు' అని ఆకాశ్ చోప్రా( Aakash Chopra) పేర్కొన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన దులీప్ ట్రోఫీలో 184 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచీ నమోదు చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న అనధికార వన్డే సిరీస్ ఆడుతున్నాడు.
ఇవి కూడా చదవండి:
WTC 2025-27: టీమిండియా ఫైనల్ చేరాలంటే?
NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి