Share News

ICC Fines Babar Azam: పాకిస్థాన్ స్టార్ ప్లేయర్‌కు ఐసీసీ భారీ షాక్

ABN , Publish Date - Nov 18 , 2025 | 03:44 PM

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజమ్ కు బిగ్ షాక్ తగిలింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో అతడు ప్రవర్తించిన తీరుకు ఐసీసీ అతడి ఫీజులో కోత విధించింది.

ICC Fines Babar Azam: పాకిస్థాన్ స్టార్ ప్లేయర్‌కు ఐసీసీ భారీ షాక్
Babar Azam ICC Fine

పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవరాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెంచరీ చేసినా, వికెట్లు తీసినా.. వీళ్ల ఓవరాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుంది. అనేక సార్లు ఐసీసీ జరిమానా, వార్నింగ్ ఇచ్చి.. చివాట్లు పెట్టిన వారి బుద్ధి మారడం లేదు. తాజాగా పాకిస్థాన్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ అజమ్(Babar Azam)కు భారీ షాక్ తగిలింది. నవంబర్‌ 16న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో శృతిమించి ప్రవర్తించినందుకు ఐసీసీ అతడికి జరిమానా విధించింది.


నవంబర్ 16న శ్రీలంక, పాకిస్థాన్(Srilana VS Pakistan) మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌కు ముందే బాబర్‌ తన సుదీర్ఘ సెంచరీ కలను నెరవేర్చుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బాబర్ 119 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 807 రోజులు, 83 మ్యాచ్‌ల త‌ర్వాత బాబర్‌ సాధించిన తొలి సెంచరీ ఇదే. నవంబర్ 16న జరిగిన మూడో వన్డే లో 34 పరుగులకే బాబర్ ఔటయ్యాడు.


దీంతో అసహనానికి గురైన బాబర్‌ ఔటయ్యాక వికెట్లను బ్యాట్‌(Babar Misconduct Sri Lanka ODI)తో తన్నాడు. తర్వాత అతడి సెంచరీ మత్తును ఐసీసీ వదిలించింది. బాబర్ చేసిన పని ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లో లెవెల్‌-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. ఫలితం బాబర్‌ డిసిప్లినరీ రికార్డుకు ఓ డీమెరిట్‌ పాయింట్‌( ICC Demerit Point) యాడ్‌ చేయబడింది. అలాగే ఆ మ్యాచ్‌కు సంబంధించిన ఫీజులో 10 శాతం కోత విధించింది. గడిచిన 24 నెలల కాలంలో బాబర్‌ చేసిన మొదటి తప్పిదం ఇదే కావడంతో ఐసీసీ నామమాత్రపు చర్యలతో వదిలిపెట్టింది. ఐసీసీ చర్యలను బాబర్‌ కూడా అంగీకరించాడు.


కాగా, స్వదేశంలో శ్రీలంక(Srilanka)తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాకిస్థాన్‌ 3–0తో క్లీన్‌స్వీప్‌(ODI Series Clean Sweep) చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో పాక్‌ 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 45.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాకిస్తాన్‌ 44.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్‌ తర్వాత పాక్‌ సొంతగడ్డపైనే శ్రీలంక, జింబాబ్వేతో కలిపి ముక్కోణపు టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ టోర్నీ నేటి (నవంబర్ 18) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌(Pakistan), జింబాబ్వే తలపడనున్నాయి.


ఇవి కూడా చదవండి:

WTC 2025-27: టీమిండియా ఫైనల్ చేరాలంటే?

NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2025 | 04:37 PM