NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్
ABN , Publish Date - Nov 18 , 2025 | 03:04 PM
వెస్టిండీస్ న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. రేపు రెండో వన్డే జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ కు బిగ్ షాక్ తగిలింది.
స్వదేశంలో వెస్టిండీస్‌తో న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్(New Zealand vs West Indies) ఆడుతుంది. ఈ క్రమంలో కివీస్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, తొలి వన్డే సెంచరీ చేసిన డారిల్ మిచెల్ గాయం(Daryl Mitchell Injury) కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో మిచెల్ తొడ కండరాలు పట్టేశాయి. మ్యాచ్ లోనే కాసేపు మిచెల్ బాగా ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించి వివిధ పరీక్షలు నిర్వహించారు.
మిచెల్‌కు స్కానింగ్ చేయగా.. చిన్నపాటి చీలిక (minor tear) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అతడి(Daryl Mitchell Injury)కి రెండు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ క్రమంలో అతడిని జట్టును నుంచి న్యూజిలాండ్ సెలక్టర్లు తప్పించారు. మిచెల్ స్ధానాన్ని వెటరన్ బ్యాటర్ హెన్రీ నికోల్స్(Henry Nicholls Replacement)తో భర్తీ చేశారు. మిచెల్ ఆరోగ్యం గురించి ఆ జట్టు కోచ్ రాబ్ వాల్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
'మిచెల్ వంటి అద్బుతమైన ఆటగాడు సిరీస్ మధ్యలో గాయం కారణంగా దూరమవ్వడం మాకు గట్టి ఎదురు దెబ్బే. అతడు మా జట్టులో కీలక సభ్యుడు. తదుపరి రెండు మ్యాచ్‌లలో అతడి లేని లోటు మాకు కచ్చితంగా కనిపిస్తుంది' అని కోచ్ రాబ్ వాల్టర్(Rob Walter Comments) పేర్కొన్నారు. మిచెల్ తిరిగి వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశముందని సమాచారం. ఇప్పటికే తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలిచి.. సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. నవంబర్ 19న రెండో వన్డే జరగనుంది.
న్యూజిలాండ్ జట్టు(అంచనా): డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, మార్క్ చాప్‌మన్
ఇవి కూడా చదవండి:
WTC 2025-27: టీమిండియా ఫైనల్ చేరాలంటే?
అతడిని చూసి నేర్చుకోండి: గావస్కర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి