Nigar Sultana: నేనేమీ హర్మన్‌ప్రీత్‌ను కాను: బంగ్లా కెప్టెన్ సుల్తానా
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:49 AM
బంగ్లాదేశ్ మహిళా జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ తన జూనియర్లను కొడుతుందని ఆ జట్టు పేసర్ జహనారా ఆలమ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుల్తానా తాజాగా స్పందించింది.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ జట్టు పేసర్ జహనారా ఆలం ఆమెపై సంచలన ఆరోపణలు చేసింది. ‘జోటీ జూనియర్లను కొడుతుంది. ఇది కొత్తేమీ కాదు’ అని చెప్పడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశం అయింది. ఈ ఆరోపణలను బంగ్లా క్రికెట్ బోర్డు(BCB) కూడా ఖండించింది. తాజాగా ఈ ఆరోపణలపై సుల్తానా(Nigar Sultana) స్పందించింది.
‘ఎవరినైనా నేను ఎందుకు కొడతాను? నేనేమైనా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur)నా? నేనేప్పుడైనా ఆమె లాగా స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టానా? మా ఇంట్లో ఉన్నప్పుడు.. నేనేదైనా వంట చేస్తున్నప్పుడు.. నా వ్యక్తిగత విషయాల్లో బ్యాట్‌తో కొట్టాలనుకుంటే కొడతాను. నా పూర్తిగా నా ఇష్టం. అంతే కానీ ప్లేయర్లను నేనేందుకు కొడతాను? ఎవరో నా మీద ఆరోపణలు చేశారని నేనేందుకు బాధ పడాలి? అయినా ఒకరిని నమ్మించే అవసరం నాకు లేదు’ అని నిగర్ జోటీ వెల్లడించింది.
హర్మన్ స్టంప్స్ ఎప్పుడు కొట్టిందంటే?
బంగ్లా కెప్టెన్ జోటీ ప్రస్తావించిన ఈ ఘటన 2023 భారత్–బంగ్లాదేశ్ సీరీస్‌లో జరిగింది. ఆఖరి వన్డేలో హర్మన్ ఆడిన షాట్‌కు అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన హర్మన స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టింది. ఆ మ్యాచ్‌లో భారత్ 226 లక్ష్యంతో బరిలో దిగింది. ఒక్క పరుగు తేడాతో ఓటమి చవి చూసింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ ఘటన తర్వాత హర్మన్‌ప్రీత్‌కు రెండు మ్యాచ్‌ల నిషేధం కూడా విధించారు.
ఇవి కూడా చదవండి:
అతడిని చూసి నేర్చుకోండి: గావస్కర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి