Share News

IND VS BAN Women’s Series: భారత్‌-బంగ్లాదేశ్‌ సిరీస్‌‌పై కీలక అప్ డేట్

ABN , Publish Date - Nov 18 , 2025 | 05:11 PM

భారత్ , బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ రద్దైనట్లు తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత కారణంగా బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

IND VS BAN Women’s Series: భారత్‌-బంగ్లాదేశ్‌ సిరీస్‌‌పై కీలక అప్ డేట్
India Bangladesh Women’s Series Cancelled

భారత్, బంగ్లాదేశ్‌ (India vs Bangladesh) మహిళా క్రికెట్‌ జట్ల మధ్య జరగనున్న సిరీస్ పై ఓ కీలక అప్ డేట్ వచ్చింది. ఈ రెండు జట్ల మధ్య డిసెంబర్‌ నెలలో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌ (3 వన్డేలు, 3 టీ20లు) రద్దైనట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్‌కు అనుమతి లభించలేదని బీసీసీఐ వర్గాల చెబుతున్న ట్లు సమాచారం. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకున్న సంగతి తెలిసిందే. ఆమెను తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లా ప్రభుత్వం భారత్ కు లేఖ రాసింది. ఈ అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.


ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో (FTP) భాగమైన భారత్, బంగ్లాదేశ్ సిరీస్‌కు సంబంధించి ఖచ్చితమైన తేదీలు, వేదికలు ​ఖరారు కావాల్సి ఉంది. అయితే ఈ లోపే రద్దు నిర్ణయం వెలువడిందని ఓ ప్రముఖ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ సిరీస్‌ జరగాల్సిన సమయంలో బీసీసీఐ ప్రత్యామ్నాయ హోమ్‌ సిరీస్‌కు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తుంది. జనవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL2026) దృష్ట్యా ఈ సిరీస్ పెద్దగా ప్రభావం ఉండదని సమాచారం​. డబ్ల్యూపీఎల్‌ తర్వాత భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు(India Women Australia Tour) వెళ్లాల్సి ఉంది.


అలానే కొద్ది రోజుల కిందట పురుషుల క్రికెట్‌లో కూడా భారత్‌, బంగ్లాదేశ్‌(IND VS BAN) జట్ల మధ్య జరగాల్సిన సిరీస్‌ వాయిదా పడింది. ఆగస్టులో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆ సిరీస్‌ను 2026 సెప్టెంబర్‌కు మార్చారు. మొత్తంగా మహిళల సిరీస్ రద్దుకావడంతో బంగ్లాదేశ్ కు బిగ్ షాక్ తగిలినట్లే అని క్రీడా నిపుణులు చెబుతున్నారు. కాగా ఇటీవల ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌(World Cup 2025)లో భారత్‌ విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో చివరి జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించిన టీమిండియా.. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఏకంగా కప్ నే కైవసం చేసుకుంది.


ఇవి కూడా చదవండి:

WTC 2025-27: టీమిండియా ఫైనల్ చేరాలంటే?

NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2025 | 05:11 PM