Home » Pahalgam Terror Attack
పహల్గాం దాడి అనంతర పరిణామాలు, భద్రత, సన్నద్ధతపై ప్రధానమంత్రి తన నివాసంలో మంగళవారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించారు. సుమారు గంటన్నర సేపు ఈ సమావేశం జరిగింది.
జాతీయ భద్రతాంశాలపై విధాన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ బుధవారంనాడు కీలక సమావేశం జరుపనుంది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించనున్నారు. ఈ కీలక సమావేశానికి ముందుగానే మోదీ నివాసంలో త్రివిధ దళాధిపతులు, అజిత్ దోవల్ తదితరులు మంగళవారం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Pahalgam Terror Attack: అందరూ అక్కడే ఉన్న ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లారు. మ్యాగీ ఆర్డర్ చేసుకుని తిన్నారు. మ్యాగీ తినటం అయిపోయిన తర్వాత టీ ఆర్డర్ చేశారు. ఇక్కడ వీళ్లు టీ తాగుతున్న సమయంలో కింద లోయలో బుల్లెట్ల వర్షం మొదలైంది.
పహల్గాంలో ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకోవడంతో జమ్మూకశ్మీర్ అంతటా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు ఉధృతం చేశారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లు, బలగాల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించేందుకు ఎంహెచ్ఏలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు.
పహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించి తాజా వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. పర్యాటకుడి కెమెరాలో బంధించబడిన భయానక దృశ్యాలు ఒళ్లు గగుర్పొడుస్తున్నాయి..
పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఈ దాడి గురించి పాకిస్తాన్‌కు చెందిన చాలా మంది నేతలు, ఆర్మీ అధికారులు పిచ్చి వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది కూడా భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు.
Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్, పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఉగ్ర మూక 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలి తీసుకుంది. ఉగ్రవాదులు పర్యాటకుల మతం ఏంటో కనుక్కుని మరీ చంపేశారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ ముస్లిం వ్యక్తిని కూడా కాల్చేశారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను స్వపక్ష కాంగ్రెస్ నేతలు, విపక్ష బీజేపీ నేతలని తేడా లేకుండా కుంకుడు కాయల రసంతో తలంటేశారు. నెహ్రూ తర్వాత పాకిస్థాన్ వీధుల్లో ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగించేది నిన్నే అంటూ..
Pahalgam Terror Attack: దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని, వారికి సాయం చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఎన్ఐఏ ప్రాథిమిక దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. నలుగురు టెర్రిస్టులు.. రెండు గ్రూపులుగా విడిపోయారు. రెండు వైపుల నుంచి పర్యాటకులపై కాల్పులు జరిపారు.
ఊరందరిదీ ఒకదారి.. తమది మరో దారన్నట్టుగా పాశ్చాత్య మీడియా పోకడలు కనిపిస్తున్నాయి. పహల్గాం ఘటన జరిగింది మొదలు.. వచ్చిన మొదటి వార్త నుంచీ కూడా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలైన..