Share News

Parliament Discussion: పహల్గాంపై చర్చకు సై

ABN , Publish Date - Jul 26 , 2025 | 03:11 AM

పహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది..

Parliament Discussion: పహల్గాంపై చర్చకు సై

న్యూఢిల్లీ, జులై 25 (ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. శుక్రవారం జరిగిన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో.. లోక్‌సభలో 16 గంటల పాటు రాజ్యసభలో 16 గంటల పాటు చర్చ నిర్వహించాలని నిర్ణయించారు. చర్చను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ప్రారంభిస్తారని, హోంమంత్రి అమిత్‌ షా, విదేశాంగ మంత్రి జై శంకర్‌ చర్చల్లో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధానిమోదీ ఈ చర్చలో పాలు పంచుకుంటారని వెల్లడించాయి. కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌, ప్రియాంక, సమాజ్‌వాది పార్టీ ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు పహల్గాం ఘటనపై ప్రశ్నలు లేవనెత్తేందుకు సిద్ధ్దపడుతున్నారు. దీనితో సోమవారం సభ వాడి వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పహల్గాంలో నిఘా వైఫల్యం, దాడి చేసిన ఉగ్రవాదులను అరెస్టు చేయలేకపోవడం, భారత యుద్ధ విమానాల కూల్చివేతపై ట్రంప్‌ ప్రకటన, దౌత్య వైఫల్యాలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 03:11 AM