Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ దేశాలు
ABN , Publish Date - Jul 02 , 2025 | 10:07 AM
Pahalgam Terror Attack: బుధవారం క్వాడ్ దేశాల మీటింగ్ జరిగింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిపై ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.

QUAD Statement On Terrorism: జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశాయి. విలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని అన్నాయి. బుధవారం క్వాడ్ దేశాల మీటింగ్ జరిగింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిపై ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
ఆ ప్రకటనలో.. ‘ఉగ్రవాదాన్ని, తీవ్రవాద చర్యల్ని క్వాడ్ ముక్త కంఠంతో ఖండిస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి కట్టుగా క్వాడ్ దేశాలు పోరాటం చేస్తాయి. ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని క్వాడ్ ఖండిస్తోంది. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ వ్యక్తి చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు క్వాడ్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడికి వ్యూహ రచనలు చేసిన వారిని.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారిని ఎలాంటి ఆలస్యం చేయకుండా యూఎన్ శిక్షించాలి’ అని పేర్కొన్నారు. కాగా, పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 7వ తేదీన పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయారు. ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి.
ఇవి కూడా చదవండి
పెళ్లై నెలన్నర.. ఊహించని నిర్ణయం తీసుకున్న యువతి..
అనులోమ విలోమ ప్రాణాయామంతో ఈ 6 వ్యాధులు దూరం..