Share News

Operation Mahadev: శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. పహల్గామ్ ఉగ్రవాదులు హతం..!

ABN , Publish Date - Jul 28 , 2025 | 01:38 PM

శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం అందుతోంది. బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా హతమైనట్లు తెలుస్తోంది.

Operation Mahadev: శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. పహల్గామ్ ఉగ్రవాదులు హతం..!
Operation Mahadev

జమ్మూకశ్మీర్, జులై 28: శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం అందుతోంది. బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా హతమైనట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రవాదులే లక్ష్యంగా రక్షణ బలగాలు ‘ఆపరేషన్ మహదేవ్’ నిర్వహించాయి. హిర్వాన్-లిద్వాన్‌లో ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రమూకలు హతమయ్యారు. చనిపోయిన ఒక్కో ఉగ్రవాదిపై రూ. 20 లక్షల రివార్డ్ ఉంది. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు ముందు కశ్మీర్‌లో పహల్గామ్ ఘటన నిందితులు హతమయ్యారు.


Mount-Mahadev.jpg

మూడు నెలల క్రితం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మారణహోమం వెనుక ఉన్న ముగ్గురు అనుమానిత పాకిస్థాన్ ఉగ్రవాదులను ఇవాళ భారత భద్రతా దళాలు మట్టుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శ్రీనగర్‌లోని లిద్వాస్ జనరల్ ఏరియాలోని మౌంట్ మహాదేవ్ సమీపంలో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు ఆర్మీ అధికారులకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆపరేషన్ మహాదేవ్ చేపట్టాయి. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని మోహరించాయి. ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు ఈ ఆపరేషన్ మహాదేవ్‌లో పాల్గొన్నాయి. భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా దళాలు.. ఉగ్రమూకలపై విరుచుకుపడ్డాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రమూకలు హతమయ్యారు. కాగా, రెండు రోజుల క్రితమే దచిగామ్ అడవిలో కొందరు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు ఆర్మీకి సమాచారం అందింది. స్థానిక సంచార జాతుల వారు కూడా ఈ విషయాన్ని కాన్ఫామ్ చేశారు. ఆ వెంటనే ఆపరేషన్ మహాదేవ్ చేపట్టారు.


ఇదిలాఉంటే.. పహల్గామ్ దాడి ఘటన, ఆపరేషన్ సిందూర్ అంశంపై సోమవారం నాడు పార్లమెంట్‌లో చర్చ జరుగనుంది. ఇలాంటి సమయంలో జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జరగడం, హతమైన ఉగ్రవాదుల్లో పహల్గామ్ ఘటన నిందితులు ఉండటం.. కేంద్ర ప్రభుత్వానికి మంచి పరిణామమనే చెప్పాలి. ఎందుకంటే.. పహల్గామ్ దాడి వెనకున్న ఉగ్రవాదులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో.. పహల్గామ్ దాడి నిందితులు హతమైనట్లు వచ్చిన సమాచారం కేంద్రాన్ని సేఫ్‌ జోన్‌లో పడేసినట్లయింది.


Also Read:

ఆపరేషన్ సిందూర్‌ చర్చపై శశి థరూర్ దూరం ఎందుకు?

ఆసక్తికరంగా ప్రవీణ్ కుమార్ స్టేట్‌మెంట్

For More National News and Telugu News..

Updated Date - Jul 28 , 2025 | 06:19 PM