Home » bomb blasts
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు మరణశిక్షే సరి అని హైకోర్టు ధ్రువీకరించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ 2016లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదని, శిక్షను జీవిత ఖైదుగా మార్చడం వృథా ప్రయాసే అవుతుందని వ్యాఖ్యానించింది.
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో బాంబు పెట్టానంటూ ఓ గుర్తుతెలియని దుండగుడు మెయిల్ చేయడం తీవ్ర కలకలం రేపింది. కలెక్టరేట్లో బాంబు పెట్టానని, గురువారం మధ్యాహ్నం దాన్ని పేల్చేస్తానని బెదిరిస్తూ మెయిల్ చేశాడు.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మానవబాంబు దాడిలో 27మంది దుర్మరణంపాలయ్యారు. వారిలో 14మంది సైనికులు ఉన్నారు. మరో 62 మంది తీవ్రగాయాలపాలవ్వగా.. వారిలో 46మంది జవాన్లు ఉన్నారు.
Blast in Railway Station: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో రైల్వే స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందగా.. 46 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 14 మంది సైనికులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
తిరుపతిలో ఎనిమిది హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం రాత్రి 9.30 గంటల నుంచి వరుసగా ఈ హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ పంపారు.
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం 50కిపైగా విమానాలతోపాటు తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి.
విమానాలకు బాంబు బెదిరింపులు తామరతంపరగా పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా కంపెనీలకు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ శనివారం పలు సూచనలు జారీ చేసింది.
దేశంలో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. రోజూ ఇలాంటి హెచ్చరికలు వస్తుండడం అధికారవర్గాల్లో అయోమయం సృష్టిస్తోంది.
ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడుకు పాల్పడింది తామేనంటూ ఖలిస్థానీ మద్దతుదారుల గ్రూప్ ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కలకలం రేగింది. ప్రశాంత్ విహార్ సీఆర్పీఎఫ్ పాఠశాల ప్రహరీ గోడ వద్ద ఉదయం 7.50 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.